ఎన్నో ప్రయోజనాలున్న ఇ-శ్రమ్ కార్డు గురించి తెలుసా..? ఇలా అప్లై చేసుకోండి!
e-shram: పేద ప్రజల అభ్యున్నతి కోసం కేంద్రంలోని మోదీ సర్కారు పలు పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తోంది. వాటిలో కొన్నింటికి విపరీతమైన క్రేజ్ ఉండగా, మరికొన్ని ప్రచారం లేక అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదు. అటువంటి వాటిలో ఒకటి ఇ-శ్రమ్ కార్డ్. శ్రామిక్ కార్డుగా పిలిచే ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..
దేశంలో అధిక శాతం మంది భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారు. వీరికి pf, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉండవు. ఏళ్ల తరబడి అదే పనిచేస్తున్నా గ్రాడ్యుటీ అంటేనే తెలియదు. ఇటువంటి శ్రమ జీవుల భవిష్యత్ భద్రత కోసం, వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధికగమించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే ఈ ఇ-శ్రమ్ కార్డ్.

దీని ద్వారా కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదానికి లోనై పాక్షిక వికలాంగులుగా మారితే లక్ష, మరణం సంభవిస్తే 2 లక్షల వరకు బీమా లభిస్తుంది. కేవలం ఇన్యూరెన్స్ మాత్రమే కాకుండా వారి పిల్లలకు ఉచిత సైకిళ్లు, పనిముట్లు, కుట్టు మిషన్లు వంటి ఇతర ఆర్థిక సహాయాలు ఈ పథకం కింద
అందుకోవచ్చు.
శ్రామిక్ కార్డ్ పేరిట ఆగస్టు 2021లో ఈ పోర్టల్ ప్రారంభించబడింది. కార్మిక శాఖ నిర్వహిస్తున్న ఈ పథకంలో చేరేందుకు 16 నుంచి 59 ఏళ్ల వయస్సున్న వ్యక్తులు అర్హులు. ఇప్పటివరకు 27 కోట్ల 13 లక్షలకు పైగా కార్డులు మంజూరు చేయబడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ఇతర పథకాల ప్రయోజనాలను వీరు పొందేందుకు వీలుగా.. రేషన్ కార్డుతో ఇ-శ్రామ్ కార్డును అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇ-శ్రమ్ కార్డు పొందేందుకు ఆన్ లైన్ ద్వారా eshram.gov.inలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుతో లింక్ కాబడిన మొబైల్ నంబరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. OTP ఎంటర్ చేసిన అనంతరం చిరునామా, విద్యార్హతలు వంటి వివరాలు నమోదు చేయాలి. నైపుణ్యం, పని స్వభావంతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్ చేయాలి. ధృవీకరణ కోసం మొబైల్ కు వచ్చిన OTP నమోదు చేస్తే, కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications