IPO News: కొత్త వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టిన ఐపీవో తొలిరోజే సంచలన లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. పైగా అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇ-ఫ్యాక్టర్ ఎక్స్‌పీరియన్సెస్ కంపెనీ ఐపీవో గురించే. స్టాక్ మార్కెట్‌లో 53.33 శాతం ప్రీమియంతో ఐపీవో ఎన్ఎస్ఈలో రూ.115 రేటు వద్ద అద్భుతమైన జాబితాను నమోదు చేసింది. పైగా లిస్టింగ్ జరిగిన కొద్ది సేపటికే కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో కంపెనీ షేర్ ధర రూ.120.75 స్థాయికి చేరుకుంది.

ఇ-ఫ్యాక్టర్ ఎక్స్‌పీరియన్సెస్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కోసం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు తెరవబడింది. ఐపీవో కోసం ప్రైస్ బ్యాండ్ రూ.71 నుంచి రూ.75గా కంపెనీ నిర్ణయించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ 25.92 కోట్లను సమీకరించింది. దీని కోసం 34.56 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఐపీవోలో ఒక్కో లాటు పరిమాణం 1600 షేర్ల చొప్పున విక్రయించింది. అంటే ఐపీవోలో పాల్గొనాలంటే ఇన్వెస్టర్లు కనీసం రూ.1,20,000 పెట్టుబడిగా పెట్టారు. ఈ ఐపీవోకు మార్కెట్ల నుంచి అపూర్వమైన స్పందన రావటంతో 4 రోజుల్లో 80 సార్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.7.38 కోట్లను సమీకరించింది.
కంపెనీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో ఉంది. లైటింగ్, సౌండ్, ఇతర ఈవెంట్‌లకు సంబంధించిన అన్ని పనులను కంపెనీ చేస్తోంది. పైగా ఇది ఎక్కువగా ప్రభుత్వ ప్రాజెక్టులను పొందుతోంది. ప్రస్తుతం దిల్లీ, ఒడిశా, జైపూర్, నోయిడాలో తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కంపెనీలో మెుత్తం 32 మంది ఉద్యోగులు ఉన్నారు.


Click it and Unblock the Notifications