E commerce News: ఈమధ్య లేఆఫ్స్ అనేమాట నిత్యకృత్యం అయిపోయింది. ప్రతిరోజూ ప్రపంచంలోని ఏదో ఓ మూల నుంచి ఈ పదాన్ని వింటూనే ఉన్నాం. దిగ్గజ టెక్ కంపెనీలు ఇప్పటికే వేలాది మందిని ఇంటికి పంపాయి. మరో భారీ సంస్థ వాటి బాటలోనే నడడానికి సిద్ధమైంది.
ఇ-కామర్స్ దిగ్గజం ఇబే(eBay) దాదాపు వెయ్యి మంది సిబ్బందికి ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. ఫుల్ టైం ఉద్యోగుల్లో దాదాపు 9 శాతం మందిని తొలగించడానికి రెడీ అయింది. అదనంగా రాబోయే నెలల్లో మరిన్ని రౌండ్ల తొలగింపులను ప్లాన్ చేస్తోంది. ఈమేరకు ఇమెయిల్ ద్వారా తన సిబ్బంది సమాచారం ఇచ్చింది.

'మేము పురోగతిని సాధిస్తున్నప్పుడు, మొత్తం హెడ్‌కౌంట్ మరియు ఖర్చులు వ్యాపార వృద్ధిని మించిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి, ఎండ్-టు-ఎండ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, కస్టమర్‌ల అభిరుచులకు అనుగుణంగా సంస్థను తీర్చదిద్దాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మా టీమ్స్‌ను సమలేఖనం చేయడంతో పాటు ఏకీకృతం చేసే సంస్థాగత మార్పులను అమలు చేస్తున్నాము' అని ఇబే సీఈవో జేమీ ఇయాన్నోన్ తెలిపారు.
గత ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా తన శ్రామికశక్తిలో 4 శాతం మంది అంటే 500 మంది ఉద్యోగులను ఇబే తొలగించింది. కొవిడ్ అనంతరం అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్‌ను తీర్చేందుకు పలు కంపెనీలు అధికంగా నియామకాలు జరిపాయి. అయితే 2022 ముగింపు నుంచి పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ, ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి.
More From GoodReturns

Layoffs: ఏఐ మీ ఉద్యోగాన్ని లాగేసుకుంటుందా లేక మిమ్మల్ని బాస్‌ను చేస్తుందా?

Layoffs: లేఆఫ్స్ వల్ల పనితీరు ఎందుకు పడిపోతుంది? సైన్స్ చెబుతున్న నిజాలివే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications