For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్లపై కొత్త పన్ను, ఒక శాతం టీడీఎస్

|

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ పైన 1 శాతం మేర టీడీఎస్‌ను కొత్త పన్నుగా విధించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీంతో ఈ-కామర్స్ సైట్లపై వస్తువులను విక్రయించే వారిపై భారం పడనుంది. ఇందుకు కొత్త సెక్షన్లు 194ఓను ప్రవేశ పెట్టనుంది.

ఈ-కామర్స్ లావాదేవీలపై కొత్తగా ఒక శాతం టీడీఎస్ (మూల ధనం వద్ద పన్ను మినహాయింపు)ను విధిస్తూ కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం డిజిటల్‌ ప్లాట్‌ఫాంను నిర్వహించే ఈ-కామర్స్ ఆపరేటర్... విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1% టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది.

E commerce companies to collect 1 per cent TDS from sellers under new levy

ఈ సవరణ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి వస్తుంది. ఈ -కామర్స్ ఆపరేటర్ లేదా డిజిటల్ ప్లాట్ ఫాంను నిర్వహించే వాళ్లు లేదా ఓనర్లు మొత్తం స్థూల విక్రయాలు లేదా సేవలు లేదా రెండింటి పైన ఒక శాతం టీడీఎస్‌ను విధించవలసి ఉంటుంది.

అయితే, ఎవరైనా విక్రేత ఈ-కామర్స్ సైట్ ద్వారా జరిపిన స్థూల విక్రయాల మొత్తం రూ.5 లక్షలలోపు ఉండి ఆధార్ లేదా పాన్‌ను ఇచ్చి ఉంటే ఈ నిబంధన వర్తించదు. దీనిని అధ్యయనం చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలిపింది.

English summary

ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్లపై కొత్త పన్ను, ఒక శాతం టీడీఎస్ | E commerce companies to collect 1 per cent TDS from sellers under new levy

he government on Saturday proposed a new levy of one per cent TDS (tax deducted at source) on e-commerce transactions, a move that could increase burden on sellers on such platforms.
Story first published: Sunday, February 2, 2020, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X