Multibagger Stock: లక్షను రూ.17 లక్షలు చేసిన స్టాక్.. ఇన్వెస్టర్లకు తుఫాను లాభాలు..
Multibagger Stock: ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ ర్యాలీలో అనేక స్టాక్స్ తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్నాయి. మధ్యస్థ కాలంలో పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను తెచ్చి పెడుతున్నాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది డైనమిక్ కేబుల్స్ కంపెనీ షేర్ల గురించే. వేర్స్ అండ్ కేబుల్స్ తయారీ వ్యాపారంలో కంపెనీ నిమగ్నమై ఉంది. గడచిన మూడేళ్ల కాలంలో కంపెనీ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. ఈ కాలంలో 1600 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.363.95 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

మూడేళ్ల కిందట స్టాక్ ధర రూ.21 వద్ద ఉంది. ఎవరైనా ఇన్వెస్టర్ అప్పట్లో కంపెనీల షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే.. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.17.33 లక్షలకు చేరుకుని ఉండేది. ప్రస్తుతం స్టాక్ తన 52 వారాల గరిష్ఠ ధర అయిన రూ.375ను తాకి ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగే డైనమిక్ కేబుల్స్ స్టాక్ 52 వారాల కనిష్ఠాన్ని పరిశీలిస్తే రూ.131.55 వద్ద ఉంది.
డైనమిక్ కేబుల్స్ షేర్లు గత ఏడాది కాలంలో 231 శాతం మేర పెరిగాయి. జూలై 11, 2022న BSEలో కంపెనీ షేర్లు రూ.111.35 వద్ద ఉన్నాయి. జూలై 11, 2023న BSEలో డైనమిక్ కేబుల్స్ షేర్లు రూ.375కి చేరుకున్నాయి. అలాగే గత 6 నెలల్లో డైనమిక్ కేబుల్స్ షేర్లు దాదాపు 82% రాబడిని అందించాయి. 2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే.. స్టాక్ ధర 75 శాతం మేర లాభపడింది. పోయిన నెలలో కంపెనీ షేర్లు 43 శాతం ర్యాలీని చూశాయి.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications