Multibagger Stock: లక్షను రూ.54 లక్షలు చేసిన షుగర్ స్టాక్.. మీ దగ్గర ఉందా..?
Sugar Multibagger: స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌ల నుంచి మంచి లాభాలను ఆర్జించాలనుకునే వారికి ఎలా ధనవంతులు కావాలో ప్రఖ్యాత ఇన్వెస్టర్లు కొన్ని మార్గాలను సూచించారు. రిటైల్ ఇన్వెస్టర్లు మంచి కంపెనీల్లో తమ పెట్టుబడులను దీర్ఘకాలం కొనసాగించేందుకు ప్రయత్నించాలని వారు సూచించారు.
ఈక్విటీల నుంచి మంచి రాబడులను ఆశించే వారు స్టాక్స్ కొని మరచిపోవాలనే వ్యూహాన్ని ఫాలో అవ్వమని సలహా ఇస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఇన్వెస్టర్లు మల్టీబ్యాగర్ రాబడులను అందుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని ప్రఖ్యాత ఇన్వెస్టర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అలా దీర్ఘకాలంలో మంచి రాబడులను అందించి కాసుల వర్షం కురిపించిన షుగర్ స్టాక్ ద్వారికేష్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళితే ద్వారికేష్ స్టాక్ 10 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. షుగర్ స్టాక్ గత ఏడాది ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఈ పెరుగుదలను సాధించింది. స్టాక్ ధర రూ.1.70 నుంచి రూ.92 స్థాయికి పెరిగింది. ఈ క్రమంలో వాటాదారులకు 5,300 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది.
పదేళ్ల కిందట ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించినట్లయితే.. దాని విలువ రూ.54 లక్షలకు చేరుకుని ఉండేది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి కంపెనీ షేర్ ధర రూ.91.90గా ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధరను పరిశీలిస్తే రూ.75గా ఉంది. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.132.70గా ఉంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications