Future Unicorns: దిగ్గజ కంపెనీలు ఖర్చులు తాళలేక లేఆఫ్స్ ప్రకటిస్తున్న వేళ.. దేశీయ స్టార్టప్ రంగం టెక్కీలను ఆదుకుంది. కరోనా అనంతరం స్టార్టప్ ఎకో సిస్టంలో పెను మార్పులు సంభవించాయి. చాలా స్టార్టప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని యూనికార్న్ స్థాయికి చేరగా మరికొన్ని ఢీలా పడ్డాయి. దేశ,విదేశాల్లోని ఆయా కంపెనీలను ప్రసిద్ధ హురున్ సంస్థ మానిటర్ చేస్తూ రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఆ సంస్థ తన లిస్ట్ నుంచి పలు కంపెనీలకు తాజాగా ఉద్వాసన పలికింది.
డన్జో, ప్రాక్టో, రాపిడో వంటి పలు భారతీయ స్టార్టప్స్ యూనికార్న్స్ రేంజ్‌కి వెళ్లనున్నట్లు హురున్ అంచనా వేసింది. కానీ తాజాగా ఫ్యూచర్ యూనికార్న్స్ ఇండెక్స్ 2024 నుంచి ఆయా కంపెనీలను తప్పించింది. ఆ లిస్టు నుంచి వైదొలిగిన 25 ఆశాజనక స్టార్ట్ అప్స్‌లో ఈ మూడు కంపెనీలు కూడా ఉన్నాయి. కాగా సంభావ్య భవిష్యత్తు భారతీయ యూనికార్న్స్ మొత్తం విలువ 58 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 1.8 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

ఈ జాబితా నుంచి బయటకు వెళ్లిన కంపెనీలలో కేవలం 3 మాత్రమే యూనికార్న్స్ కావడం విశేషం. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ జెప్టో, ఫిన్‌టెక్ కంపెనీ ఇన్‌క్రెడ్ ఫైనాన్స్ మరియు లాజిస్టిక్స్ స్టార్టప్ పోర్టర్‌గా మాత్రమే ఆ ఘనతను సాధించాయి. ఇక ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ ఇక్సిగో IPO ద్వారా మార్కెట్లో అడుగు పెట్టనుంది. దీంతో ఇదికాస్తా ఆ జాబితా నుంచి బయటకు వచ్చింది.
2000 తర్వాత స్థాపించబడి, 200 మిలియన్ల నుంచి ఒక బిలియన్ డాలర్ల విలువ కలిగిన పలు సంస్థలను హురున్ లిస్ట్ చేసింది. వాటిని మార్కెట్లలో లిస్ట్ కానీ భవిష్యత్తు యూనికార్న్స్‌గా గుర్తించింది. వివిధ కారణాల రీత్యా ఆయా కంపెనీలు ఈ జాబితా నుంచి వైదొలుగుతూ ఉంటాయి. మార్కెట్లో జాబితా కావడం, ఇతర కంపెనీలు ఆ సంస్థలను కొనుగోలు చేయడం వల్ల ఈ లిస్ట్ నుంచి చోటు కోల్పోతాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications