Bank Holidays: సెప్టెంబర్‌లో 16 రోజులు మూతపడనున్న బ్యాంకులు..!
చాలా మందికి బ్యాంకుల్లో పని ఉంటుంది. చెక్ వేయడం లేదా అకౌంట్ తీయడం లేక డబ్బులు వేయడం, డ్రా చేయడం వంటి పనులు ఉంటాయి. అయితే వారంతా బ్యాంకులు పని చేసే రోజులు తీసుకుంటే.. వారి పనులు ప్లాన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ లో బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో వారాంతపు సెలవులు, రాష్ట్రాల వారీగా ఉండే సెలవులతో కలిపి మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు మూసి వేయనున్నారు. అయితే, బ్యాంక్ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. క్యాలెండర్‌లో పేర్కొన్న అన్ని రోజుల్లోనూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్ శాఖలు క్లోజ్ కావు.
ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాల్లో జన్మాష్టమి (లేదా కృష్ణ జయంతి) సందర్భంగా సెప్టెంబర్ 4న బ్యాంకులు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 11న జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల కారణంగా జైపూర్‌లోని బ్యాంకులు క్లోజ్ అవుతాయి. శ్రీమంత శంకరదేవ తిరుభవ్ తిథి (వర్ధంతి) సందర్భంగా సెప్టెంబర్ 12న అస్సాంలోని బ్యాంకులు పని చేయవు.

గణేశ చతుర్థి/వరసిద్ధి వినాయక వ్రతం/హర్తాలిక సందర్భంగా సెప్టెంబర్ 14న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 15న, గుజరాత్‌లో సంవత్సరి (చతుర్థి పక్షం) ఒడిశాలో నువాఖై పండుగ సందర్భంగా బ్యాంకులు మూసివేయనున్నారు. గోవాలో కూడా గణేశ చతుర్థి (రెండవ రోజు) సందర్భంగా సెలవు ఉంటుంది. శ్రీమంత శంకరదేవ జన్మోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 21న అస్సాంలోని బ్యాంకులు మూసివేయబడతాయి, అదే సమయంలో కేరళలోని బ్యాంక్ శాఖలకు శ్రీ నారాయణ గురు సమాధి సందర్భంగా సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 22న కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్‌లోని బ్యాంకులు క్లోజు కానున్నాయి. మహారాజా హరి సింగ్ జీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 23న జమ్మూ & కాశ్మీర్‌లోని బ్యాంకులు సెలవు పాటిస్తాయి. సిక్కింలో ఇంద్రయాత్ర సందర్భంగా సెప్టెంబర్ 25న బ్యాంక్ సెలవు ఉంటుంది. ఈ రాష్ట్రాల వారీ సెలవులతో పాటు, ఆదివారాలు, నెలలోని రెండవ, నాలుగవ శనివారాల్లో కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. బ్యాంక్ సెలవు దినాల్లో కూడా వినియోగదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు (ATMs), యూపీఐ (UPI) వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చని బ్యాంకులు తెలిపాయి. సెలవు దినాలతో పాటు, బ్యాంకు యూనియన్లు తలపెట్టిన వరుస దేశవ్యాప్త సమ్మెల కారణంగా సెప్టెంబర్‌లో బ్యాంకు సేవలకు అంతరాయం కలగవచ్చు.
ఐదు రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలని, అలాగే సీనియర్ బ్యాంకు అధికారుల కోసం ప్రభుత్వం సవరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దేశవ్యాప్త సమ్మెలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 11న బ్యాంకు ఉద్యోగులు, అధికారులు అఖిల భారత సమ్మె పాటిస్తారని, ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మె కొనసాగిస్తుందని UFBU తెలిపింది. ఒకవేళ సమ్మెలను విరమించకపోతే, సెప్టెంబర్‌లో, ముఖ్యంగా నెల చివరిలో బ్యాంకు వినియోగదారులు సేవలలో తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications