Bengaluru Metro: బెంగళూరులో రెండు స్టేషన్లలో ఆగకుండా వెళ్లిన మెట్రో రైళ్లు..!
బెంగళూరు మెట్రో రైలు రెండు మెట్రో స్టేషన్లలో ఆగకుండా వెళ్లిపోయింది. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్వాతంత్ర్య సభ కోసం వేలాది మంది విధాన సౌధకు తరలిరావడంతో ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అధిక రద్దీ, ప్రజల భద్రతా కారణాల దృష్ట్యా శనివారం సాయంత్రం రెండు పర్పుల్ లైన్ స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయాలని బీఎంఆర్‌సీఎల్‌ను ఆదేశించారు. కార్యక్రమ వేదిక వద్ద జనం పెరిగిపోవడంతో, సర్ ఎం విశ్వేశ్వరయ్య సెంట్రల్ కాలేజ్, కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్లను సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మూసివేశారు. ఈ రెండు స్టేషన్లలో రైళ్లు ఆగకుండా వెళ్లాయి.
అధికారుల ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విధానసౌధ మెట్రో స్టేషన్ శనివారం ఉదయం 10.30 నుంచి రాత్రి 9.30 వరకు మూసినట్లు బీఎంఆర్‌సీఎల్ ప్రకటించింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ మూడు స్టేషన్లను ప్రయాణికుల కోసం తిరిగి తెరిచారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాయంత్రం సమయంలో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆపరేషన్స్ విభాగం నిర్ణయం తీసుకుంది. రైళ్లు ఈ మూడు స్టేషన్లను దాటవేసి వెళ్లగా, ఎంజీ రోడ్, నాడప్రభు కెంపెగౌడ స్టేషన్లు యధావిధిగా పనిచేశాయని బీఎంఆర్‌సీఎల్ అధికారి ఒకరు చెప్పారు.

ఈ మూసివేతల వల్ల విధానసౌధకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇబ్బందులు కలిగాయి. సాయంత్రం అంతా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు కొనసాగడంతో ఎంజీ రోడ్ స్టేషన్‌లో కూడా భారీ రద్దీ ఏర్పడింది, దీంతో ప్లాట్‌ఫారమ్‌లకు చేరుకోవడం కష్టంగా మారింది. మరోపక్క బెంగళూరు నమ్మ మెట్రో బ్లూ లైన్ 2026 చివరి నాటికి వాణిజ్య సేవలకు ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అసంపూర్తిగా ఉన్న సివిల్, సిస్టమ్స్ పనుల కారణంగా ప్రతిపాదిత ప్రారంభం 2027కి వాయిదా పడింది. ఈ లైన్ ప్రారంభం అయ్యేందుకు మరో సంవత్సరం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
కేఆర్ పుర, సిల్క్ బోర్డ్ మధ్య దాదాపు 19 కిలోమీటర్ల ఈ కారిడార్‌ను ఔటర్ రింగ్ రోడ్ (ORR) వెంబడి నిర్మిస్తున్నారు. ఇది అనేక ప్రధాన టెక్నాలజీ, ఉపాధి కేంద్రాలను కలుపుతుంది.
బీఎంఆర్‌సీఎల్ గతంలో ఈ ఏడాది కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ నాటికి కేఆర్ పుర, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ మధ్య ట్రయల్ రన్‌లను లక్ష్యంగా చేసుకుంది.
ట్రయల్-రన్ మైలురాయి కోసం ఏజెన్సీ పని చేస్తూనే ఉందని, అయితే వాణిజ్య ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి ఉంటుందని ఒక సీనియర్ బీఎంఆర్‌సీఎల్ అధికారి చెప్పారు. గతంలో అక్టోబరు నాటికి కేఆర్ పుర, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ మధ్య ట్రయల్ రన్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే పలుచోట్ల పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, 2026 నాటికి వాణిజ్య కార్యకలాపాల లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని తెలుస్తోంది. రైలు కార్యకలాపాలను ప్రారంభించే గడువును ఇప్పుడు 2027కి పొడిగించే అవకాశం కనిపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications