Chicken And Eggs: భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు.. వచ్చే నెలలో ఇంకా పెరిగే అవకాశం..!
సండే వచ్చిందంటే దాదాపు చాలా మంది చికెన్ లేదా మటన్ లేదా చేపలు తెచ్చుకుంటారు. అయితే ఎక్కువ మంది మాత్రం చికెన్ తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు చికెన్ ధర కొండెక్కింది. చికెన్ తోపాటు కోడి గుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. కార్తీక మాసం, అయ్యప్ప మాలలు వేసే సమయం అయినా ధరలు పెరుగుతున్నాయి. కోళ్లకు వేసే దాణా ఖర్చులు పెరగడం వల్ల చికెన్, కోడి గుడ్ల ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ నాటికి చికెన్, గుడ్ల ధరలు ఏకంగా 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.252 వద్ద ఉంది. రిటైల్ లో కిలో రూ.280 వరకు చేరింది. . డ్రస్స్‌డ్ చికెన్ రూ.223, రిటైల్ లైవ్ బర్డ్ రూ.144, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.117కు చేరాయి.
అటు ఏపీలో కూడా చికెన్, గుడ్ల ధరలు పెరిగాయి. విజయవాడ జోన్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.266 ఉండగా.. డ్రస్స్‌డ్ రూ.236, రిటైల్ లైవ్ బర్డ్ రూ.152, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.125కు చేరింది. కోడి గుడ్డ ఒక్కోటి రూ.7.50 లకు చేరింది. అంటే డజన్ కోడి గుడ్లు రూ.90 లకు చేరాయి. 30 గుడ్లకు రూ.230కి చేరింది. వచ్చే నెలలో క్రిస్మస్ ఉంది. న్యూ ఇయర్ వేడుకలు కూడా ఉన్నాయి. కేక్స్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. చికెన్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం దణా ధరలు పెరగడం. ముఖ్యంగా కోళ్లు పెట్టే మొక్కజొన్న, నూకల ధరలు భారీగా పెరిగాయి. గత సంవత్సరం కిలో మొక్కజొన్న రూ.22 పలికితే.. ఇప్పుడు రూ.32 లకు చేరింది.

అటు నూకల ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో రూ.14 నుంచి రూ.15 ఉన్న నూకల ధర ప్రస్తుతం 31 నుంచి 32 రూపాయలకు చేరింది. ఎల్ నినో ప్రభావంతో వచ్చే రోజుల్లో మొక్కజొన్న, వడ్ల దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిమాండ్ పెరిగి ధరలు భారీగా పెరుగుతాయి. ఫలితంగా చికెన్ ధరలు పెరగనున్నాయి. ఇక కోడి గుడ్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం దణా ఖర్చలు పెరగడంతో పాటు డిమాండ్ పెరగడం. సాధారణంగా చలికాలంలో ఉత్తరాదిలో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. పైగా వచ్చే నెలలో క్రిస్మస్, న్యూ ఇయర్ ఉండడం వల్ల గుడ్ల డిమాండ్ పెరగనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications