Price Hike: సామాన్యులకు షాక్.. పెరగనున్న టీ, టిఫిన్, భోజనాల ధరలు..!
కొద్ది నెలల క్రితం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో ఎల్పీజీ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కమర్షియల్ ఎల్పీజీ ధరలు భారీగా పెరగడంతో చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు టీ, టిఫిన్, భోజనాల ధరలు భారీగా పెంచాయి. చిన్న టిఫిన్ సెంటర్లలో రూ.30 ఉన్న టిఫిన్ ధర రూ.40 కు పెంచారు. రూ.40 ఉన్న ధర రూ.50 పెరిగింది. ఇప్పుడు అవే ధరలు కొనసాగుతున్నాయి. తాజాగా ముడిసరకుల ధరలు పెరగడంతో మరోసారి మరోసారి టీ, టిఫిన్ల, భోజనాల ధరలు పెరగనున్నాయి. కొన్ని రెస్టారెంట్లు ఇప్పటికే ధరలు పెంచాయి. ఉదయాన్నే హోటళ్లలో వేడివేడి ఇడ్లీ, దోశ, వడ తింటారు. దోశ, ఇడ్లీ చేయడానికి బియ్యం అవసరం. వడ చేయడానికి మినప పప్పు, పూరీలకు గోధమ పిండి.
ఇప్పుడు బియ్యం, పప్పులు, గోధమ పిండి ధరలు పెరిగాయి. అలాగే పాల ధరలు కూడా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూ ధరలను భారీగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా హోటల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలుస్తోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు హోటల్ తిండి భారం కానుంది. గడచిన 6 నుంచి 8 నెలల కాలంలో ముడిసరుకుల ధరలు దాదాపు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని రెస్టారెంట్ యజమానులు చెబుతున్నారు. అంతే కాకుండా కమర్షియల్ గ్యాస్ బుడ్ల ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

పాలు, పనీర్, చీజ్ వంటి డెయిరీ ఉత్పత్తులతో పాటు కూరగాయలు, నూనెలు, చక్కెర, పప్పు దినుసుల పెరిగాయని గుర్తు చేస్తున్నారు. అన్ని వస్తువుల రేట్లు విపరీతంగా పెరగడంతో రెస్టారెంట్లపై భారం పడిందని ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు చెప్పాడు. ఈ భారాన్ని కొంతవరకు వినియోగదారులపై మోపాల్సి వస్తోందని పేర్కొన్నాడు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ టిఫిన్లు, కాఫీలు, మిల్క్ బేస్డ్ ఐటమ్స్‌లో ఎక్కువగా వాడే నెయ్యి, వెన్న ధరలు భారీగా పెరిగాయి. గత రెండున్నర నెలల్లోనే నెయ్యి, వెన్న ధరలు కిలోకి ఏకంగా రూ.150 వరకు పెరిగినట్లు రెస్టారెంట్ల యజమానులు గుర్తు చేస్తున్నారు. ఈ పెరుగుదల కారణంగా దోశలు, రైస్ ఐటమ్స్, లంచ్ మెనూల ధరలను 5 నుంచి 10 శాతం వరకు పెంచాల్సి వచ్చిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా డెయిరీ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా వివరిస్తున్నారు. ఇటీవలే అమూల్ తన పాల ధరలను లీటరుకు రూ. 2-4 వరకు పెంచింది. అమూల్ తాజా లీటరుకు రూ. 2, అమూల్ గోల్డ్ లీటరుకు రూ. 4 చొప్పున ధరలు పెరిగాయి. మదర్ డెయిరీ కూడా పాల ధరను పెంచింది. నాందిని డెయిరీ కూడా పాల ధరలను పెంచింది. కేవలం పాలు, నెయ్యి మాత్రమే కాకుండా బియ్యం, పప్పులు, పంచదార, వంట నూనెలు, కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో రూ.100 ఖర్చయ్యే సాధారణ భోజనం, టిఫిన్ ఇప్పుడు రూ.105 నుంచి రూ.110 వరకు చేరింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications