Chicken: నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు..!
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్, కోడి గుడ్ల ధరలు కార్తీక మాసంలో క్రమంగా తగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా గుడ్లు, బ్రాయిలర్ కోళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. నవంబర్ 11న రూ. 6.70గా ఉన్న గుడ్డు ధర.. నవంబర్ 28 నాటికి రూ. 1.30 తగ్గి రూ. 5.40కి చేరుకుంది. కార్తీక మాసం, అయ్యప్ప పూజలు, శివ మాల వేసుకున్న వారు పెరగడంతో చికెన్ కు డిమాండ్ భారీగా తగ్గింది. దీంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. చికెన్ ధరలు తగ్గడంతో మాంసం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పౌల్ట్రీ వ్యాపారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత వారం వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.300 పైగా ఉండగా.. ప్రస్తుతం రూ.250 తగ్గింది. కిలో చికెన్‌పై ఏకంగా రూ.50 తగ్గినట్లు చెబుతున్నారు. చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా భారీగా తగ్గాయి. స్కిన్లెస్ చికెన్ ధర రూ.252గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రేటు రూ.223 వద్ద కొనసాగుతోంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.144కు చెరింది.ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ ధర రూ.117గా ఉంది. ఇక హైదరాబాద్‌లో డజన్ గుడ్ల ధర రూ.74గా ఉంది. మొన్నటివరకు డజన్ కోడి గుడ్ల ధర రూ.90గా ఉండేది. త్వరలో చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

డిసెంబర్ లో కార్తీక మాసం ముగియనుంది. ఆ తర్వాత చికెన్, గుడ్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో చికెన్, గుడ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గుడ్ ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. చలికాలంలో గుడ్లు ఎక్కువగా తింటారు. అంతే కాకుండా న్యూ ఇయర్ సందర్భంగా భారీగా కేక్ కటింగ్స్ ఉంటాయి. కేక్స్ తయారీకి గుడ్లను వాడతారు. దీంతో వాటికి డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) నమక్కల్ జోన్, నవంబర్ 28 వరకు గుడ్డు ధరను రూ. 5.40 వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. తదుపరి ధరను నవంబర్ 29న ప్రకటించనున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications