శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు..ఆలయ సిబ్బంది అకౌంట్ల నుంచి రూ.లక్షల్లో లావాదేవీలు..

కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం దొంగతనం కేసు పలు కీలక మలుపులు తిరుగుతోంది. బంగారం చోరీ కేసులు రోజు రొజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. Sabarimala ఆలయంలోని విలువైన కళాఖండాల నుండి Gold దొంగిలించబడిందనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో.. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న దర్యాప్తులో ఆలయ ఉద్యోగుల ఖాతాల్లో అనుమానాస్పద నగదు లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి.

ఇటీవలి వార్షిక పండుగ సీజన్‌లో విధుల్లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక వ్యవహారాల్లో భారీ అసమానతలు కనిపించడంతో, ఈ వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది. నవంబర్ 15 నుంచి జనవరి 20 వరకు కొనసాగిన రెండు నెలల మాండల-మకర విలక్కు పండుగ సీజన్‌లో ఆలయంలో విధులు నిర్వహించిన సిబ్బంది ఆర్థిక కార్యకలాపాలపై శబరిమల ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నివేదికను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సమీక్షించింది. ఈ నివేదికలో ఆలయ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీసుల ద్వారా జరిగిన నగదు బదిలీలు, అలాగే ఆ నిధుల మూలాలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Sabarimala temple Sabarimala transactions dubious transactions Sabarimala Sabarimala money order case Kerala High Court Sabarimala Sabarimala temple staff money order transfers Sabarimala financial irregularities Sabarimala controversy temple funds misuse Sabarimala HC probe Kerala temple scandal suspicious transactions Sabarimala Sabarimala audit temple money misuse postal money orders temple Sabarimala case news Kerala temple finances Sabarimala investigation High Court informed Sabarimala
Photo Credit:

ఈ నేపథ్యంలో జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కెవి జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది. ఆలయ పరిధిలో పనిచేస్తున్న వివిధ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి లావాదేవీల పూర్తి వివరాలు సేకరించాలని, అలాగే పండుగ సీజన్‌లో సన్నిధానంలో విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి డేటాబేస్‌ను రూపొందించాలని కోర్టు స్పష్టంగా పేర్కొంది.

విజిలెన్స్ అధికారి కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం.. ఆలయ పరిధిలోని పోస్టాఫీసులు, బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం తీవ్ర అనుమానాలకు తావిచ్చే లావాదేవీలను వెల్లడించింది. కేవలం తక్కువ వ్యవధిలోనే పోస్టాఫీసు మనీ ఆర్డర్ల ద్వారా మొత్తం రూ.14,08,880 బదిలీ అయినట్లు విచారణలో తేలింది. ఈ మొత్తానికి సంబంధించి నిధుల మూలం, చట్టబద్ధతపై స్పష్టత లేకపోవడం తీవ్ర సందేహాలకు దారి తీసిందని విజిలెన్స్ అధికారి కోర్టుకు తెలిపారు.

కోర్టు పరిశీలనలో ఒక ఉద్యోగి పోస్టాఫీసు ద్వారా రూ.1,38,000 పంపగా.. మరొక ఉద్యోగి రూ.1,07,450 పంపినట్లు గుర్తించారు. అంతేకాదు, మరో ముగ్గురు ఉద్యోగుల ఖాతాల్లో కూడా ఇదే తరహా నగదు బదిలీ నమూనాలు కనిపించాయి. ఈ ఉద్యోగులను విచారణకు హాజరుకావాలని విజిలెన్స్ అధికారులు ఆదేశించినప్పటికీ.. వారు ఆ ఆదేశాలను పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ పరిస్థితుల్లో సంబంధిత బ్యాంకులు, పోస్టల్ అధికారుల నుంచి లావాదేవీల పూర్తి వివరాలు సేకరించడం, ప్రతి అనుమానాస్పద లావాదేవీ వెనుక ఉన్న కారణాలను లోతుగా పరిశీలించడం అత్యవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి నిధి బదిలీపై వివరాలను సేకరించి, అవసరమైతే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కోర్టుకు హామీ ఇచ్చింది.

అసలు ఈ కేసు ఏంటంటే..ఆలయంలో ఉపయోగించే కొన్ని సంప్రదాయ అలంకరణ వస్తువులు, కళాఖండాలు గతంతో పోలిస్తే తక్కువ బరువుగా ఉన్నాయన్న అనుమానాలు మొదట కనిపించాయి. భక్తులు సమర్పించిన విలువైన బంగారం భాగాలుగా మారిపోయి ఉండొచ్చన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆస్తుల భద్రత, నిర్వహణలో లోపాలున్నాయా అనే అంశంపై హైకోర్టు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ విచారణను పర్యవేక్షించేందుకు శబరిమల ప్రత్యేక కమిషనర్‌ను నియమించారు.

ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నివేదికలో కొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి. ఆలయంలోని కొన్ని వస్తువుల బరువు, విలువలకు సంబంధించిన సరైన రికార్డులు లేకపోవడం, పాత ఇన్వెంటరీతో కొత్త లెక్కల మధ్య తేడాలు ఉండటం వంటి విషయాలు కోర్టును ఆందోళనకు గురిచేశాయి. ఇవన్నీ బంగారం దొంగతనం జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని మరింత బలపరిచాయి.

కేరళ హైకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) శబరిమల ఆలయం నుంచి అంచనాకు మించి బంగారం చోరీ జరిగినట్టు నిర్ధారించింది. ద్వారపాలక విగ్రహాలు, గర్భగుడి తలుపు రెక్కలతో పాటు సన్నిధానం తలుపుల ఆకృతులు, శివుడి విగ్రహం, ఆర్చ్ సహా మొత్తం ఏడు కళాకృతుల నుంచి పసిడి మాయమైనట్టు SIT నివేదిక వెల్లడించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టిన తరువాత సుమారు 4.5 కేజీల బంగారాన్ని రికార్డుల్లో రాగిగా మార్చినట్టు తేలింది. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ వద్ద రసాయన మిశ్రమంతో బంగారాన్ని వేరుచేసి, బళ్లారి నగల వ్యాపారికి విక్రయించినట్టు గుర్తించారు. ఈ కేసులో ఆలయ ప్రధాన పూజారి సహా ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇక బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉన్నికృష్ణన్ అరెస్టు జరిగిన 90 రోజులలోపు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమవడంతో ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ షరతులలో భాగంగా పొట్టి ఒక్కొక్కటి రూ. 2 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే కేరళ విడిచి వెళ్లకూడదని, శబరిమల ఆలయం ఉన్న పతనంతిట్ట జిల్లాలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని తేల్చి చెప్పింది. అతను ప్రతి మంగళవారం, శుక్రవారం దర్యాప్తు అధికారులకు రిపోర్ట్ చేయాలని తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+