Social Media Viral: చాలామంది పెళ్లి కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టడం తెలిసిందే. అనంతరం పిల్లల్ని కనడం, వారిని పెంచి పోషించడం సర్వ సాధారణం. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాహం తర్వాత జీవితం ఎలా ఉండాలి అనే విషయంపై ఈమధ్య పెళ్లికి ముందే అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. కానీ అందుకు మించిన ట్విస్ట్ ఈ స్టోరీలో చూడవచ్చు.
పెళ్లి తర్వాత భర్తతో పిల్లల్ని కనేందుకు, వారిని పెంచేందుకు ఓ దుబాయ్ ఇల్లాలు సవాలక్ష కండిషన్లు పెట్టింది. ప్రతినెలా 2.5 కోట్లు రూపాయలు భృతిగా చెల్లించాలని డిమాండ్ చేసింది. ఉచితంగా పురిటినొప్పిని ఏమాత్రం భరించనని తెగేసి చెప్పింది. డెలివరీ సమయంలో తన అందచందాలను కాపాడేందుకు మేకప్ మరియు హెయిర్ డ్రెస్సెంగ్ టీమ్ ఉండాలని కోరింది. డెలివరీ అనంతరం దాదాపు 2 వేల మంది తనను చూసేందుకు వస్తారని, అందుకోసం తనకు VIP గదిని బుక్ చేయాలని పట్టుబట్టింది.

వీటికి అదనంగా పిల్లల మెయింటెనెన్స్ కు ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇద్దరు పిల్లలు అయితే ఈ అమౌంట్ డబుల్ అవుతుందని పేర్కొంది. అంతేకాకుండా తన రోజువారీ జీవితానికి ఎటువంటి భంగం కలగకుండా పిల్లల ఆలనాపాలనా చూసేందుకు పని మనుషులను పెంచాలని కోరింది. రాత్రిళ్లు నిద్రాభంగం కాకుండా నర్సును సైతం రిక్రూట్ చేయాలని కండీషన్ పెట్టింది.
ఇవే కాకుండా బుర్జ్ అల్ అరబ్ మీద భారీ ఎత్తున జెండర్ రివిల్ చేయాలని తన కోరుతున్నట్లు చెప్పుకొచ్చింది. తన భర్త పెద్దఎత్తున ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలని, కొత్త కారు గిఫ్ట్ గా ఇవ్వాలని ఆశిస్తోంది. ప్రసవం నాటికి తాను వీటిని పూర్తిగా నెరవేరుస్తాడని తెలిపింది. ఈ విషయాలన్నీ పెళ్లికి ముందే తన భర్తతో చర్చించానని చెప్పి షాక్ ఇచ్చింది. దీన్నంతా చదివిన నెటిజన్లు ఇది వివాహము కాదని కేవలం బిజినెస్ డీల్ అని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications