కొద్దిరోజుల క్రితం ప్రముఖ కన్నడ అండ్ తమిళ సినీ నటి రన్యా రావును బంగారం అక్రమ రవాణా పై బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందంఆమె నుండి 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది, దీని విలువ సుమారు రూ.12.56 కోట్లు ఉంటుందని అంచనా.
అయితే ఈ సంఘటన తర్వాత ప్రజల మనస్సులలో తలెత్తే ప్రశ్న ఏంటంటే, విదేశాల నుండి ముఖ్యంగా దుబాయ్ నుండి భారతదేశానికి ఎంత బంగారం తీసుకువచ్చు, ఎలాంటి రూల్స్ ఉంటాయో తెలుసా.. మీరు విదేశాల నుండి భారతదేశానికి బంగారాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తే ముందుగా ప్రభుత్వ పరిమితులు ఇంకా కస్టమ్ సుంకం నియమాల గురించి తెలుసుకోవాలి. భారతదేశంలోకి బంగారాన్ని తీసుకురావడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.

ఎంత బంగారం తీసుకురావచ్చు: పురుషలు 20 గ్రాముల వరకు, మహిళాలు 40 గ్రాముల వరకు, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 40 గ్రాముల వరకు తీసుకురావొచ్చు. ఈ పరిమితిలోపు బంగారం పై ఎటువంటి కస్టమ్ సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయాణీకులు ఈ మొత్తానికి మించి బంగారం తీసుకువస్తే కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కస్టమ్ సుంకం రేట్లతో చూస్తే పురుష ప్రయాణీకులకు 20 గ్రాముల వరకు (రూ. 50,000 విలువ) ఎలాంటి ఛార్జీలు లేవు.
అయితే 20 - 50 గ్రాములకి 3%, 50 - 100 గ్రాములకి 6%, 100 గ్రాముల కంటే ఎక్కువకి 10%. మహిళా ప్రయాణీకులకు కస్టమ్ డ్యూటీ రేట్లు 40 గ్రాముల వరకు (రూ.1,00,000 విలువ) ఎలాంటి ఛార్జీలు లేవు, 40 - 100 గ్రాములకి 3%, 100 - 200 గ్రాములకి 6%, 200 గ్రాముల కంటే ఎక్కువకి 10%. పిల్లలు బంగారం తీసుకురావడానికి నియమాలు: 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా 40 గ్రాముల వరకు బంగారాన్ని సుంకం లేకుండా తీసుకురావచ్చు, కానీ దీనికి సంబంధానికి ఫ్రూప్స్ చూపించాల్సి ఉంటుంది. 40 గ్రామూల వరకు ఛార్జీలులేవు కానీ 40 - 100 గ్రాములకి 3%, 100 - 200 గ్రాములకి 6%, 200 గ్రాముల కంటే ఎక్కువకి 10%,
బంగారు నాణేలకు వర్తించే నియమాలు: 20 గ్రాముల వరకు బంగారు నాణేలపై కస్టమ్ సుంకం ఉండదు. అయితే 20 నుండి 100 గ్రాముల బరువున్న బంగారు నాణేలపై 10% కస్టమ్ డ్యూటీ వర్తిస్తుంది. 100 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న బంగారు నాణేలపై కూడా 10% కస్టమ్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.
భారతీయ పాస్‌పోర్ట్ దారులకు ప్రత్యేక రూల్స్: ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం విదేశాలలో ఉంటున్న భారత పౌరులు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులు (PIOలు) కన్సెషన్ కస్టమ్స్ సుంకంతో బంగారాన్ని తీసుకురావచ్చు. బేసిక్ కస్టమ్ డ్యూటీ 12.5%, సాంఘిక సంక్షేమ పన్ను (SWS) 1.25%. మొత్తంమీద, భారతీయ పాస్‌పోర్ట్ దారులు ఈ మినహాయింపు పరిధిలోకి వస్తే 13.75% కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
బంగారం తీసుకురావడానికి అవసరమైన డాకుమెంట్స్: బంగారం కొన్నట్లు ప్రూఫ్(receipt) అలాగే గోల్డ్ ప్యూరిటీ సర్టిఫికెట్, బంగారు కడ్డీపై బరువు, సీరియల్ నంబర్ గురించి సమాచారం ఉండాలి. ఒకవేళ ప్రయాణీకులు వీటిపై తప్పుడు సమాచారం అందిస్తే లేదా రూల్స్ పాటించకపోతే బంగారాన్ని జప్తు చేయవచ్చు లేదా భారీ జరిమానా కూడా విధించవచ్చు.


Click it and Unblock the Notifications