సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తులను రూపొందించి కొత్త చరిత్ర సృష్టించింది.దుబాయ్ డ్రెస్ పేరుతో రూపొందించిన ఈ gold dress.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాయి. ప్రస్తుతం ఇది షార్జాలో జరుగుతున్న వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో - 56వ ఎడిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ దుస్తులు పూర్తిగా 21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడ్డాయి. దీని మొత్తం బరువు 10.0812 కిలోగ్రాములు కాగా, మార్కెట్ విలువ దాదాపు AED 4.6 మిలియన్లు (సుమారు రూ. 11 కోట్లు) ఉంటుందని అంచనా. బంగారు ధరలో మాత్రమే కాకుండా దీని ప్రత్యేకమైన కళాత్మక రూపకల్పన కారణంగా కూడా ఈ దుస్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

అల్ రోమైజాన్ గోల్డ్ ప్రకారం దుబాయ్ డ్రెస్ నాలుగు ప్రధాన భాగాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో బంగారు కిరీటం 398 గ్రాములు, నెక్లెస్ 8,810.60 గ్రాములు, చెవిపోగులు 134.1 గ్రాములు,తల అలంకరణ 738.5 గ్రాములు బంగారంతో తయారు చేశారు. ఈ భాగాలను కలిపి మొత్తం దుస్తుల రూపం ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది.
దుస్తుల రూపకల్పనలో కేవలం బంగారం మాత్రమే కాకుండా రంగురంగుల విలువైన రత్నాలు కూడా ఉపయోగించారు. వీటిని క్లిష్టమైన చెక్కడాలు, నాజూకైన అలంకరణలతో సమన్వయం చేసి, ఎమిరాటీ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ప్రతి రేఖ, ప్రతి నమూనా చరిత్రను చెప్పేలా ఉంది. అల్ రోమైజాన్ ప్రతినిధుల ప్రకారం.. డిజైనర్లు ఎమిరాటీ వారసత్వం నుండి ప్రేరణ పొందారు. ఆధునిక స్పర్శను కలిపి ఈ దుస్తులు ఒకవైపు చరిత్రను ప్రతిబింబిస్తే మరోవైపు సమకాలీన సృజనాత్మకతను చూపిస్తాయని తెలిపారు.
దుబాయ్ డ్రెస్ కేవలం బంగారు దుస్తుల రికార్డు మాత్రమే కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచవ్యాప్తంగా నాయకత్వ స్థానాన్ని సాధించాలనే ఆకాంక్షకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. బంగారం, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ గమ్యస్థానంగా దుబాయ్‌ను మరింత బలపరచడమే దీని ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. అల్ రోమైజాన్ గోల్డ్ రీజినల్ డిప్యూటీ మేనేజర్ మొహ్సేన్ అల్ ధైబానీ మాట్లాడుతూ.. ఇది ఎమిరాటీ కళాకారుల సంతకం, ప్రత్యేకమైన సృజనాత్మకతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ ప్రదర్శనలో AED 1.5 మిలియన్ల విలువైన బంగారు సైకిల్ కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్‌లో 500కిపైగా ప్రదర్శకులు పాల్గొంటున్నారు. వీరిలో ఇటలీ, భారతదేశం, టర్కియే, అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్ మరియు మలేషియా వంటి దేశాల నుండి డిజైనర్లు, తయారీదారులు ఉన్నారు. అదనంగా 1,800కి పైగా పరిశ్రమ నిపుణులు కూడా పాల్గొనడం విశేషం.
More From GoodReturns

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications