Success Story: దుబాయ్‌లోని కంపెనీలో పనిచేస్తున్న ఓ యువకుడు ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని ఆలోచనతో భారత్ కు తిరిగి వచ్చాడు. స్ట్రాబెర్రీ ఫార్మింగ్ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రస్తుతం లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చి స్ట్రాబెర్రీ వ్యాపారంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన యువకుడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీ సాగు..
గత కొన్నేళ్లుగా భారతీయ యువత వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అదే విధంగా దుబాయ్ లో మంచి జీతం తీసుకుంటున్న నవీన్ మోహన్ రాజ్ వంశీ అనే యువకుడు ఉద్యోగం మానేసి స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్ట్రాబెర్రీ సాగుచేస్తూ లక్షలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

ఎంబీఏ పూర్తిచేసి..
చెన్నైలో ఎంబీఏ పూర్తి చేసిన నవీన్ దుబాయ్ వెళ్లి అక్కడ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పని చేయడం ప్రారంభించాడు. కానీ కొంతకాలం తర్వాత అతని జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. నవీన్ దుబాయ్‌లో పనిచేస్తున్నప్పుడు ఒకసారి స్ట్రాబెర్రీ ఫామ్‌కి వెళ్లాడు. అప్పుడే అతని మనస్సులో స్ట్రాబెర్రీ సాగు చేయాలనే ఆలోచన అతని మదిలో చిగురించింది.

భారత్ తిరిగి వచ్చి..
అలా వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కొవిడ్ సమయంలో నవీన్ తన స్వస్థలమైన సితార్‌పూర్‌కు తిరిగి వచ్చాడు. అక్కడి కృషి విజ్ఞాన కేంద్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్ట్రాబెర్రీ సాగు నేర్చుకున్నాడు. ఆ తర్వాత నవీన్ ఎకరంలో సుమారు 20 వేల స్ట్రాబెర్రీ మొక్కలు నాటాడు. ఇందుకోసం ఏకంగా రూ.3 లక్షలు ఖర్చు చేశాడు. దీంతో 150 నుంచి 160 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అలా కొన్ని నెలల్లోనే లక్షల్లో లాభం సంపాదించాడు.

రెండింతల సంపాదన..
ఎకరం భూమిలో రూ.3 లక్షల పెట్టుబడితో స్ట్రాబెర్రీ సాగు ప్రారంభించిన నవీన్ రూ.6 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. స్ట్రాబెర్రీలతో పాటు ఇతర పంటలను కూడా పండించి అదనపు ఆదాయం పొందుతున్నాడు. ముఖ్యంగా బంతిపూల మొక్కల ద్వారా రూ.50 వేలు సంపాదిస్తున్నాడు. తర్వాత సీతాఫలాలు పండించి భారీ ఆదాయాన్ని పొందుతున్నాడు.

స్ట్రాబెర్రీ సాగు ప్రాముఖ్యత..
స్ట్రాబెర్రీలు సాగు చేయటానికి బంకమట్టి, లోమీ నేలలు అనువుగా ఉంటాయని సూచిస్తున్నాడు. ఇక రెండవది ఉష్ణోగ్రత. స్ట్రాబెర్రీ సాగుకు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉత్తమమని తెలిపాడు. స్ట్రాబెర్రీలను పాలీ హౌస్‌లో లేదా ఓపెన్ ఫీల్డ్‌లో పండించవచ్చని, స్ట్రాబెర్రీ సాగు బాగా చేస్తే ఐటీ కంపెనీకి వచ్చే ఆదాయాని కంటే ఎన్నో రెట్లు అధికంగా సంపాదించవచ్చని నవీన్ అంటున్నాడు.


Click it and Unblock the Notifications