Betting App: దేశంలో బెట్టింగ్ యాప్స్ పెద్ద సంచలనంగా మారాయి. ఈ క్రమంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ నెట్‌వర్క్ బయటపడింది. పెద్ద కార్పొరేట్ కంపెనీల యజమానులు సైతం ఇందులో ఉన్నట్లు గతంలో కొందరి పేర్లు బయటపడ్డాయి.
తాజాగా మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ఇద్దరు ప్రధాన యజమానుల్లో ఒకరైన 43 ఏళ్ల రవి ఉప్పల్‌ను ఈడీ ఆదేశాల మేరకు ఇంటర్‌పోల్ జారీ చేయబడ్డాయి. దీంతో దుబాయ్‌లోని స్థానిక పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిందితుడిని భారత్‌కు పంపించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దుబాయ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

ఛత్తీస్‌గఢ్, ముంబై పోలీసులతో పాటు అక్రమ బెట్టింగ్‌లతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసు వ్యవహారంలో ఉప్పల్‌ను ED విచారిస్తోంది. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ఉప్పల్‌తో పాటు మరొక ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్‌పై ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కోర్టులో అక్టోబర్‌లో మనీలాండరింగ్ ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది. పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు అనే ద్వీప దేశంలో ఉప్పల్ పాస్‌పోర్ట్ తీసుకున్నట్లు చార్జ్ షీట్‌లో ఏజెన్సీ కోర్టుకు తెలియజేసింది. ఈ కేసులో దాదాపు రూ.6,000 కోట్ల మేర నేరం జరిగినట్లు ఈడీ అధికారులు అంచనా వస్తున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మహదేవ్ బుక్, రెడ్డన్న ప్రెస్టోప్రోతో సహా 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని నవంబర్ 5న ఆదేశించింది. అక్రమ బెట్టింగ్ యాప్ సిండికేట్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు, ఛత్తీస్‌గఢ్‌లోని మహాదేవ్ బుక్ యాప్‌పై జరిగిన దాడులు పెద్ద సంచలన విషయాలను బయటపెట్టాయి. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సుమారు రూ.508 కోట్లు క్యాష్ కొరియర్ చేసినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి.


Click it and Unblock the Notifications