Air India: టాటాల గూటికి తిరిగి వచ్చిన ఎయిర్ ఇండియాలో అసభ్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావటంతో పెద్ద దుమారం రేపుతోంది. గత నవంబర్‌లో ఎయిరిండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న మహిళపై ఒక కో పాసింజర్ మద్యం మత్తులో మూత్రం పోశాడు. ఇది జరిగిన వారాల తర్వాత ఎయిర్ ఇండియా కేసు నమోదు చేసింది.

వికృతంగా ప్రవర్తన..
మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి ఒక మహిళ బట్టలు, బూట్లు, బ్యాగ్ మూత్రంలో తడిసేలా చేయటంతో ఆమె సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఆమె ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భాద్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని చెప్పింది.

అసలు ఏం జరిగింది..అసలు ఏం జరిగింది..
నవంబర్ 26న న్యూయార్క్ నుంచి దిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భోజనం తర్వాత లైట్లు డిమ్ అయ్యాయి. ఆ తర్వాత బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వ్యక్తి సహ ప్రయాణికురాలిపై జిప్ తీసి మూత్ర విసర్జన చేసింది. వేరే సీటు అందుబైటులో లేనందున సిబ్బందికి మహిళ ఫిర్యాదు చేసింది. పైగా ఫ్లైట్ దిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకువటంతో ఆమె చంద్రశేఖరన్‌కి లేఖ రాసింది.
భయానకంగా ప్రయాణం..
ఎయిర్ ఇండియాకు చెందిన AI102 విమానంలో ఈ భయానక, అసభ్యకమైన ఘటన చోటుచేసుకుంది. తన బిజినెస్ క్లాస్ ట్రిప్‌లో జరిగిన భయంకరమైన సంఘటన గురించి ఆమె తన తీవ్ర నిరుత్సాహాన్ని లేఖలో వెల్లడించింది. భోజనం తర్వాత లైట్లు ఆపగా నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆమె అందులో వివరించింది. తన పక్కన ఉన్న మరో ప్రయాణికుడు సదరు వ్యక్తిని తిరిగి తన సీటుకు వెళ్లాలని సూచించినప్పటికీ కొంత సేపు అతడు స్పందించలేదని ఆమె తన లేఖలో వెల్లడించింది. ఈ లేఖ తర్వాత ఎయిర్ ఇండియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తిని 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని ఎయిర్ ఇండియా అంతర్గత కమిటీ సిఫార్సు చేసింది.

సిబ్బంది సహకారంతో..
ఈ ఘటన జరిగినప్పుడు ఇబ్బందిని ఎదుర్కొన్న ప్రయాణికురాలు వెంటనే ఫ్లైట్ సిబ్బందిని సంప్రదించింది. దీంతో సిబ్బంది వారి సీటును ఆమెకు ఇచ్చారు. గంట తర్వాత ఆమెను తిరిగి సీటుకు వెళ్లాలని సిబ్బంది కోరారు. అప్పటికీ సదరు సీటుపై కొన్ని షీట్లను కప్పారు. కానీ అప్పటికీ మూత్రం వాసన రావటంతో ఆమె నిరాకరించింది. దీంతో చేసేది లేక సిబ్బందికి సంబంధించిన మరో సీటులో ఆమె మిగిలిన 5 గంటల ప్రయాణాన్ని కొనసాగించింది. ఇలాంటి సంఘటన 2018 ఆగస్టులోనూ ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications