Bumper IPO: ఐపీవోలు వస్తుంటాయ్ పోతుంటాయ్ కానీ కొన్ని మాత్రం మర్చిపోలేని రికార్డులను సృష్టిస్తుంటాయ్. ఈ క్రమంలో ఒక ఐపీవో కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. ఎందుకంటే లిస్టింగ్ కి ముందుగానే ఇన్వెస్టర్ల సొమ్మును అమాంతం రెండింతలు చేసేసింది. గ్రేమార్కెట్లోనే పైసల్ డబుల్ చేసి.. పైసా వసూల్ పర్ఫామెన్స్ చూపుతున్న ఐపీవో గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

షేర్ అలాట్మెంట్..
కొన్ని ఐపీవోల్లో షేర్లు రాకుంటే మంచిది అనిపిస్తుంది. కానీ ఈ రోజు మాట్లాడుకుంటున్న ఐపీవోలో షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్లకు నిజంగా పండుగ అనే చెప్పుకోవాలి. అవును ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ IPO గురించే. పబ్లిక్ కోసం డిసెంబర్ 13 నుంచి 15 వరకు అందుబాటులో ఉంది. ఈ క్రమంలో మూడు రోజుల బిడ్డింగ్‌లో 243.70 సార్లు సబ్‌స్క్రయిబ్ చేయబడింది.

గ్రేమార్కెట్ దూకుడు..
మార్కెట్లోకి వస్తున్న ఎస్ఎమ్ఈ ఐపీవో అయిన ద్రోణాచార్య గ్రే మార్కెట్లో మాత్రం విపరీతమైన బూమ్ కలిగి ఉంది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం స్టాక్ ఈరోజు గ్రే మార్కెట్ ప్రీమియం రూ.72 గా ఉంది. అంటే డిసెంబర్ 23న లిస్టింగ్ సమయంలో స్టాక్ అసలు ఇష్యూ ధర రూ.54 ఉన్నప్పటికీ.. 134 శాతం లాభంతో స్టాక్ రూ.126 వద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ కావచ్చని తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే తొలిరోజే లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంపద రెండితలు అంటే రూ.2 లక్షలు అవుతుంది.

ఐపీవో వివరాలు..
కంపెనీ ఐపీవో ద్వారా ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.33.97 కోట్లను సమీకరిస్తోంది. చిన్న ఐపీవో అయినప్పటికీ ప్రజల నుంచి దీనికి పెద్ద స్పందన కనిపిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రే మార్కెట్ ప్రీమియం(GMP) సబ్‌స్క్రిప్షన్ ముగిసిన తర్వాత మరింత పెరిగింది. అంటే SME షేరు దాదాపు రూ.126 స్థాయి (రూ.54 + రూ.72) లిస్ట్ అవుతుందని గ్రే మార్కెట్ విశ్వసిస్తోంది. ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్ షేర్ల లిస్టింగ్ డిసెంబర్ 23, 2022న BSE SME ఎక్స్ఛేంజ్‌లో జరుగుతుందని తెలుస్తోంది.

కంపెనీ వ్యాపారం..
కంపెనీ ఆధునిక డ్రోన్ సేవల రంగంలో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇండస్ట్రీలకు అవసరమైన ఇన్పెక్షన్, మానిటరింగ్, మ్యాపింగ్, పవర్ ట్రాన్స్ మిషన్ లైన్లలో డ్యామేజ్ డిటెక్షన్, అర్బన్ రూరల్ మ్యాపింగ్, గ్యాస్ అండ్ ఆయిల్ లీకేజీ, రోడ్లు హైవేల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయటం వంటి టెక్నాలజీ ఆధారిత సేవలను అందించే వ్యాపారంలో కంపెనీ ఉంది.
More From GoodReturns

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?

ఇన్వెస్టర్లు డబ్బులతో రెడీగా ఉండండి.. దేశ చరిత్రలోనే అతిపెద్ద IPO..రూ. 20 వేల కోట్ల టార్గెట్‌తో వస్తున్న NSE.

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..



Click it and Unblock the Notifications