Buzzing Stock: లాభాల్లో తేలుతున్న డ్రోన్ స్టాక్ ఇన్వెస్టర్స్.. ఒకే ఒక్క ఆర్డర్‌తో..
Buzzing Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇటీవలి కాలంలో ఎక్కువగా డ్రోన్ స్టాక్స్ హవా నడుస్తోంది. వ్యవసాయం, రక్షణ వంటి రంగాల్లో వీటి వినియోగం విరివిగా పెరగటంతో ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపిస్తున్నాయి.
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పరిశ్రమకు సంబంధించిన జెన్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో భారీగా పెరిగాయి. బీఎస్ఈలో స్టాక్ ఏకంగా 20 శాతం లాభపడింది. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.576.95 వద్ద అప్పర్ సర్క్యూట్ ను తాకింది. ఇది సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర కావటం విశేషం. గత రెండు రోజులుగా స్టాక్ 35 శాతం మేర లాభపడ్డాయి.

సైనిక శిక్షణ, యాంటీ-డ్రోన్ సొల్యూషన్‌లను అందించే సంస్థ జెన్ టెక్నాలజీస్. కంపెనీ రూ.340 కోట్ల విలువైన భారీ ఎగుమతి ఆర్డర్ పొందటం ఈ పరుగుల వెనుక అసలు కారణంగా తెలుస్తోంది. జెన్ టెక్నాలజీస్ షేర్ల 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.167.05గా ఉంది. గడచిన ఐదు రోజులుగా కంపెనీ షేర్ల పరుగులు కొనసాగుతూనే ఉన్నాయి. 2023లో స్టాక్ ఇప్పటి వరకు 208 శాతం రాబడులను ఇన్వెస్టర్లకు అందించింది.
జెన్ టెక్నాలజీస్ షేర్లు గత ఏడాదిలో 225% పెరిగాయి. జూలై 12, 2022న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేర్లు రూ.174 వద్ద ఉన్నాయి. జూలై 12న జెన్ టెక్నాలజీస్ షేర్లు రూ.573.80కి చేరాయి. గత 6 నెలల కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 195% మేర పెరిగాయి. ఈ క్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖ రూ.160 కోట్ల విలువైన ఆర్డర్‌ను కంపెనీకి ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను జెన్ టెక్నాలజీస్ జూన్ 6న ప్రకటించింది. కంపెనీ ప్రభుత్వానికి యాంటీ డ్రోన్ వ్యవస్థలను 12 నెలల కాలంలో డెలివరీ పూర్తి చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications