IPO News: మార్కెట్లోకి డ్రోన్ తయారీ కంపెనీ ఐపీవో.. ప్రైస్ బ్యాండ్ విడుదల..
Ideaforge: మార్కెట్లో ఈ వారం వచ్చే వారం ఐపీవోలు సందడి చేయనున్నాయి. ఈ క్రమంలో డ్రోన్ల తయారీ సంస్థ IdeaForge టెక్నాలజీస్ ఐపీవో జూన్ 26న ప్రారంభం కానుంది.
రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం వచ్చేవారం వస్తున్న ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.638 నుంచి రూ.672గా కంపెనీ నిర్ణయించింది. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ IPO జూన్ 29న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఇది ఒకరోజు ముందర అంటే జూన్ 23న లాంచ్ చేయబడుతుంది. కంపెనీ ఐపీవో ద్వారా రూ.567 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు ఆశిష్ భట్, అమర్‌ప్రీత్ సింగ్, నంబిరాజన్ శేషాద్రి పాల్గొంటారు. ఇతర సేల్ వాటాదారులలో A&E ఇన్వెస్ట్‌మెంట్ LLC, అగర్వాల్ ట్రేడ్‌మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్, సెలెస్టా క్యాపిటల్ II మారిషస్ తో పాటు ఇతరులు ఉన్నారు. స్టాక్ జూలై 7న BSE, NSEలలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఐరీవో ద్వారా వచ్చే సొమ్మును కంపెనీ రుణాల చెల్లింపు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతో పాటు ఉత్పత్తి అభివృద్ధిలో పెట్టుబడి, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని కంపెనీ చూస్తోంది.

IdeaForge టెక్నాలజీ IPOకి బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌లు JM ఫైనాన్షియల్, IIFL సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి. ఈ కంపెనీ మ్యాపింగ్, భద్రత, నిఘా కోసం మానవరహిత విమాన వ్యవస్థలను తయారు చేస్తోంది. ఈ డ్రోన్‌లు నిర్మాణ, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో ఉపయోగించబడతాయి. సరిహద్దుల వెంబడి ఇంటెలిజెన్స్, నిఘా కార్యకలాపాలను నిర్వహించడంలో రక్షణ దళాలకు సహాయపడతాయి.


Click it and Unblock the Notifications