బెంగళూరు వాహనదారులకు షాక్.. NICE రోడ్, ఈ-సిటీ ఫ్లైఓవర్ కొత్త టోల్ ఛార్జీలు అమల్లోకి..

బెంగళూరు నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారి మార్గాలైన నైస్ రోడ్, ఎలక్ట్రానిక్స్ సిటీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే ,జాతీయ రహదారి 44 (NH-44) లోని కొన్ని భాగాలపై సవరించిన టోల్ ఛార్జీలు జూలై 1 నుండి అమల్లోకి రావడంతో నిత్యం ప్రయాణించే పౌరులపై ఆర్థిక భారం పెరిగింది. డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. నంది ఎకనామిక్ కారిడార్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (NICE) ,బెంగళూరు ఎలివేటెడ్ టోల్‌వే ప్రైవేట్ లిమిటెడ్ (BETPL) సంస్థలు విడివిడిగా ఈ ధరల పెంపును ప్రకటించాయి. తమ రాయితీ ఒప్పందాల నిబంధనలు ,మార్చి 31, 2026 నాటి తాజా టోకు ధరల సూచిక (WPI) ఆధారంగా ఈ సవరణలు చేసినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ కొత్త ధరలు జూన్ 30, 2027 వరకు అమల్లో ఉంటాయి.

నైస్ రోడ్డు పరిధిలోకి వచ్చే బెంగళూరు-మైసూరు మౌలిక సదుపాయాల కారిడార్ (BMIC) ప్రాజెక్టులోని 40.8 కిలోమీటర్ల పెరిఫెరల్ రోడ్డు,8.1 కిలోమీటర్ల లింక్ రోడ్డులపై ప్రయాణించే ద్విచక్ర వాహనాలు, కార్లు వాటి ప్రయాణ దూరాన్ని బట్టి కనీసం 10 శాతం అదనపు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెరిగిన ధరలను సమీప రూపాయికి రౌండ్ అప్ చేస్తారు. బనశంకరి, తావరకెరె ,ఎలక్ట్రానిక్స్ సిటీ వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ నైస్ రోడ్ ద్వారా బస్సులు నడిపే బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) పై కూడా ఈ ప్రభావం పడనుంది. రవాణా సంస్థ ఈ అదనపు నిర్వహణ ఖర్చులను టికెట్ ధరల రూపంలో ప్రయాణికులపైనే మోపే అవకాశం ఉంది.

Bengaluru toll hike NICE Road toll Electronics City Flyover toll E-City Flyover Bengaluru toll rates NICE Road Bengaluru traffic toll charges Karnataka highways Bengaluru commuters FASTag BMIC BETPL NH44 Attibele toll plaza Bengaluru travel transport news toll update 2026 road travel Bengaluru news NICE - FASTag BMIC BETPL NH44 2026

మరోవైపు సిల్క్ బోర్డ్ జంక్షన్‌ను ఎలక్ట్రానిక్స్ సిటీతో అనుసంధానించే ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే ,కర్ణాటక-తమిళనాడు సరిహద్దు వరకు ఉన్న NH-44 మార్గంలో కూడా టోల్ రేట్లు మారాయి. ముంబైకి చెందిన 'గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్ట్‌నర్స్' రాయితీ ఒప్పందం కింద ఈ నిర్వహణ జరుగుతోంది. కొత్త నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్ వద్ద కార్లు, జీపులు ,వ్యాన్‌లకు ఒకే రోజులో అనేక ప్రయాణాలు చేసే 'మల్టిపుల్-జర్నీ' టోల్ రుసుము రూ. 95 నుండి రూ. 100కి పెరిగింది.

Also Read

వీటి నెలవారీ పాస్ ధర కూడా రూ. 1,885 నుండి రూ. 1,960కి సవరించబడింది, అయితే ఒకే ప్రయాణానికి (సింగిల్-జర్నీ) చెల్లించే టోల్ ఛార్జీలలో ఎలాంటి మార్పు చేయలేదు. ద్విచక్ర వాహనదారుల విషయానికి వస్తే, వారి నెలవారీ పాస్ ధర రూ. 755 నుండి రూ. 785కి పెరగ్గా, సింగిల్ ,మల్టిపుల్-జర్నీ ఛార్జీలను పాత పద్ధతిలోనే ఉంచారు. వీటితో పాటు NH-44పై ఉన్న అట్టిబెలే టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు మల్టిపుల్-జర్నీ టోల్ రుసుమును రూ. 55 నుండి రూ. 60కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+