Adani Group: అదానీ బొగ్గు కేసు తిరిగి తోడుతున్న రెవెన్యూ ఇంటెలిజెన్స్..!
Adani Group: అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతుల విషయంలో ఆరోపణలపై దర్యాప్తును తిరిగి ప్రారంభించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అనుమతి కోరింది. సింగపూర్ నుంచి సాక్ష్యాలను సేకరించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని సమాచారం.
2016 నుంచి దర్యాప్తు సంస్థ సింగపూర్ అధికారుల నుంచి అదానీ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇండోనేషియా సరఫరాదారుల నుంచి కొనుగోలు చేసిన బొగ్గును సింగపూర్ యూనిట్ అదానీ గ్లోబల్ పిటిఇ మెుదట అధిక ధరకు బిల్లింగ్ చేసినట్లు అనుమానిస్తోంది. ఆ తర్వాత దానిని భారత విభాగాలకు ఎక్కువ రేటుకు విక్రయించినట్లు ప్రధాన ఆరోపణ ఉంది. కృత్రిమంగా ధరలను పెంచి చూపటం ద్వారా బిలియన్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది.

కీలకమైన బిల్లలు, ఆధారాలు బయటకు రాకుండా అదానీ ఎంటర్ ప్రైజెస్, అనుబంధ సంస్థలు పదేపదే న్యాయపరమైన సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాయని కోర్టు పత్రాల ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీ సింగపూర్ నుంచి సాక్ష్యాలను సేకరించకుండా అధికారులను నిరోధించడానికి అనుమతించిన మునుపటి దిగువ కోర్టు ఉత్తర్వును రద్దు చేయాలని అక్టోబర్ 9 చట్టపరమైన ఫైల్‌లో DRI సుప్రీంకోర్టును కోరింది. భారతీయ అధికారులు తమ బొగ్గు రవాణాను ఓడరేవుల నుండి విడుదల చేయడానికి ముందు అంచనా వేసారని పేర్కొంది.
రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చట్టపరమైన ప్రక్రియను అనుసరించలేదంటూ అదానీ చేస్తున్న వాదనలను DRI ఖండించింది. పరస్పర న్యాయ సహాయ ఒప్పందం ప్రకారం ఆగ్నేయాసియా నగర-రాష్ట్రం నుంచి సమాచారాన్ని కోరేందుకు తమకు అనుమతి ఉందని DRI ఒక ఫైలింగ్‌లో పేర్కొంది. ఇండోనేషియా బొగ్గును దిగుమతి చేసుకుంటున్న కంపెనీలు సింగపూర్, ఇతర ప్రాంతాల్లో మధ్యవర్తుల ద్వారా రవాణా చేయబడిన బిల్లులను పరిశీలన ద్వారా డెలివరీలను ఓవర్ ఇన్‌వాయిస్ చేస్తున్నాయని ఏజెన్సీ ఆరోపించింది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన 1,300 షిప్‌మెంట్‌లను భారత అధికారులు సమీక్షించారు.


Click it and Unblock the Notifications