Boeing 787 Dreamliner: ప్రపంచ విమానయాన చరిత్రలో మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం AI171 టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కుప్పకూలింది. బోయింగ్‌కు చెందిన 787 డ్రీమ్‌లైనర్ విమానం 242 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులతో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. అయిత టేకాఫ్ కాగానే అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మేఘనినగర్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో మరోసారి బోయింగ్ విమానాల భద్రత అంశం తెరపైకి వచ్చింది. ఈ సంస్థ రూపొందించిన ఈ డ్రీమ్‌లైనర్ విమానం పలువురు శోధిస్తున్నారు. ఈ డ్రీమ్‌లైనర్ విమానం ఇంతకుముందు ఎన్నోసార్లు సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పెట్టింది. అయితే కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి.. దీని గురించి ఇప్పుడు గూగుల్ లో సెర్చ్ మొదలైంది. బోయింగ్ 787-8 అనేది 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో మొదటి వేరియంట్. 2004లో అధికారికంగా ప్రారంభించినప్పటికీ డిసెంబర్ 15, 2009న విమానయాన రంగంలోకి అడుగు పెట్టింది. 2011లో ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ (ANA)తో వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అత్యాధునిక సదుపాయాలతో పాటు ఇంధన సామర్థ్యం కలిగి ఉంది. ఇది సెకండ్ క్లాస్ ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో 210 నుంచి 248 మంది ప్రయాణికుల వరకు కూర్చునే సామర్ధ్యం ఉంది. ఈ విమానం దాదాపు 7,305 నాటికల్ మైళ్లు (13,530 కిలోమీటర్లు) మేర నాన్ స్టాప్ గా ప్రయాణించగలదు. సుదూర మార్గాలకు ఈ విమానం బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. విమాన బాడీ 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ తో నిర్మితమైంది. స్టీల్ కంటే బలంగా అల్యూమీనియం కంటే తేలికగా దీని బాడీ ఉంటుంది. దీంతో విమానం బరువు అనిపించదు. పర్యావరణరహితమైనదిగా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కు పేరు ఉంది.
బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం హైడ్రాలిక్ లీక్ సమస్యలు, బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ వంటి సమస్యలతో ఎప్పుడూ సతమతమవుతూనే ఉంటుంది. బోయింగ్ ఇంజినీర్, విజిల్ బ్లోయర్ సామ్ సలేపూర్ న్యూయార్క్ టైమ్స్, సీఎన్‌ఎన్ వంటి మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో.. బోయింగ్ 777, 787 డ్రీమ్‌లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని చాలా సందర్భాల్లో ఆరోపణలు చేశారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. వెంటనే ఈ విమానాల తయారీని పూర్తిగా నిలిపేయాలని డిమాండ్ కూడా చేశాడు. వదులుగా ఉన్న సీట్లు, సరిగ్గా ఇన్‌స్టాల్ చేయని పిన్‌లు, నట్‌లు, బోల్ట్‌లు పూర్తిగా బిగించకపోవడం, అసురక్షిత ఇంధన-లైన్ క్లాంప్‌లు వంటి సమస్యలు ఉన్నాయని ఆరోపించాడు.
ఈ విమానం 186 అడుగుల (57 మీటర్లు) పొడవు, 197 అడుగుల (60 మీటర్లు) రెక్కల విస్తీర్ణతతో కలుపుకుని దాదాపు 56 అడుగుల (17 మీటర్లు) ఎత్తు కలిగి ఉంటుంది.787-8 రెండు హై-బైపాస్ టర్బోఫ్యాన్ ఇంజిన్‌లతో (జనరల్ ఎలక్ట్రిక్ GEnx లేదా రోల్స్-రాయిస్ ట్రెంట్ 1000) ఉన్నతమైన శక్తిని అందిస్తుంది.ఈ ఇంజిన్లు 53,000 నుండి 75,000 పౌండ్ల వరకు థ్రస్ట్‌ను అందిస్తాయి. బోయింగ్ 767 వంటి పాత మోడళ్లతో పోలిస్తే ఈ విమానం ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకోలగదు. ఈ విమానం మాక్ 0.85 (సుమారు 903 కిమీ/గం లేదా 488 నాట్లు) వేగంతో ప్రయాణిస్తుంది.గరిష్టంగా టేకాఫ్ బరువు సుమారు 502,500 పౌండ్లు (227,930 కిలోగ్రాములు) చేరుకోగలదు
ఇక ఇటాలియన్ అధికారులు 787 తయారీలో ఉపయోగించే నాసిరకం టైటానియం, అల్యూమినియం మిశ్రమాలను అందించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఏరోస్పేస్ సరఫరాదారులపై క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించారు. ఇది బోయింగ్ ఇమేజ్ ని భారీగా దెబ్బతీసింది. డ్రీమ్‌లైనర్ భద్రత, రక్షణ గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఇక జనవరి 24, 2025న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 787-8 విమానం కోట్ డి ఐవోయిర్ మీదుగా ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా సమస్య తలెత్తింది. ఇనర్షియల్ రిఫరెన్స్ యూనిట్లు (IRUలు) రెండూ విఫలం కావడంతో విమానంలో ఉన్న 38 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎట్టకేలకు నైజీరియాలోని లాగోస్‌కు ఈ విమానం సురక్షితంగా తిరిగి వచ్చింది.ఈ సంఘటన పశ్చిమ ఆఫ్రికా మీదుగా వేగంగా ఎత్తుకు వెళ్లడం వల్ల జరిగిందని అధికారులు నిర్ధారించారు.
ఇక జూన్ 18, 2021న మరో సమస్యతో ఈ విమానం ఉక్కిరి బిక్కిరి అయింది. డౌన్‌లాక్ పిన్‌ను తప్పుగా ఇన్‌స్టాల్ చేయడం వల్ల జరిగిన ఇంజనీరింగ్ లోపం కారణంగా హీత్రో విమానాశ్రయంలో ఆగి ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ 787-8 విమానం ముందు భాగం నేలకు తగిలింది.ఈ సంఘటనలో కో-పైలట్, కార్గో సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే క్రాష్‌లు కాకపోయినా ఈ మధ్య కాలంలో 787-8లో హైడ్రాలిక్ లీకేజీలు, ఫ్లాప్ సమస్యలు, అత్యవసర ల్యాండింగ్‌లు వంటి సాంకేతిక లోపాలతో సతమవుతోంది. ఇక తమపై వచ్చిన ఆరోపణలను బోయింగ్ ఎప్పటికప్పుడు కొట్టిపారేసింది. తాజా ప్రమాద ఘటనపై లోతైన దర్యాప్తు జరిగాక ఈ ఆరోపణలకు సంబంధం ఉందా లేదా అనేది తేలనుంది. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో బోయింగ్‌కు షేర్లు అమెరికా ప్రీ మార్కెట్‌లో 8 శాతం మేర క్షీణించాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications