డ్రీమ్11 మాతృసంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ తాజాగా తన వ్యాపార వ్యూహంలో మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఫాంటసీ గేమింగ్ రంగంలో ఆధిపత్యం చెలాయించిన ఈ సంస్థ, ఇప్పుడు ఆర్థిక సేవల విభాగంలో అడుగుపెడుతూ డ్రీమ్ మనీ అనే కొత్త వ్యక్తిగత ఫైనాన్స్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు), SIPలు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు) వంటి పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. అలాగే రోజువారీ ఖర్చులను సులభంగా ట్రాక్ చేసే సౌకర్యం కూడా కల్పించనుంది.
డ్రీమ్ స్పోర్ట్స్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఏంటంటే.. ఇటీవలే భారత ప్రభుత్వం ఆమోదించిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టం అని చెప్పుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం, రియల్ గేమ్స్‌ను నిషేధించారు. అందువల్ల Dream11 యాప్ లోని అన్ని చెల్లింపు పోటీలను తక్షణమే నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ యాప్‌లో వినియోగదారులు ఉచితంగా ఆడగల సామాజిక ఆటలే అందుబాటులో ఉన్నాయి. డ్రీమ్ స్పోర్ట్స్ దీనిపై స్పందిస్తూ.. మేము దేశ చట్టాలకు గౌరవం ఇస్తాము. భారతదేశాన్ని 'ప్రపంచ క్రీడా సూపర్ పవర్'గా మార్చాలనే ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశయానికి మద్దతు ఇస్తున్నామని పేర్కొంది.

ఇక కొత్తగా ప్రవేశపెట్టిన డ్రీమ్ మనీ యాప్, పెట్టుబడులను మరింత సులభతరం చేయడానికి అనేక కొత్త సౌకర్యాలను అందిస్తోంది. వినియోగదారులు రోజుకు లేదా నెలకు కేవలం రూ.10 నుండి SIPలు ప్రారంభించవచ్చు. బంగారం పెట్టుబడుల కోసం, డ్రీమ్ స్పోర్ట్స్ ఆగ్‌మాంట్ డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాక, బ్యాంకు ఖాతా అవసరం లేకుండా రూ.1,000 నుండి FDల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ FDలలో పెట్టిన డబ్బును ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉండటం వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగిస్తుంది.
ఈ పరిణామం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటంటే.. ఆన్‌లైన్ గేమింగ్ చట్టం కారణంగా కోల్పోయిన మార్కెట్ అవకాశాలను భర్తీ చేస్తూ, కొత్త వ్యాపార రంగాల్లోకి విస్తరించడం లక్ష్యంగా డ్రీమ్11 పెట్టుకుంది. డ్రీమ్ స్పోర్ట్స్ ఇప్పటి వరకు కేవలం గేమింగ్ వినోద రంగంలో మాత్రమే ప్రసిద్ధి చెందగా.. ఇప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీ విభాగంలో ప్రవేశించడం ద్వారా పెట్టుబడిదారులు, వినియోగదారుల దృష్టిని ఆకర్షించాలని చూస్తోంది.
ఈ చర్యతో సంబంధం ఉన్న మరో ముఖ్య అంశం ఏంటంటే.. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ బిల్లు 2025. ఈ బిల్లును పార్లమెంట్ రెండు సభలు ఆమోదించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ఒక మైలురాయి నిర్ణయం గా అభివర్ణించారు.ఇది సమాజాన్ని ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్రతికూల ప్రభావాల నుండి కాపాడుతుంది. అదే సమయంలో..ఇ-స్పోర్ట్స్, సోషల్ గేమింగ్‌ను ప్రోత్సహించి.. భారతదేశాన్ని గేమింగ్, ఆవిష్కరణ, సృజనాత్మకతలకు కేంద్రంగా మారుస్తుందని అన్నారు.
ఈ నేపథ్యంలో డ్రీమ్ స్పోర్ట్స్ డ్రీమ్ మనీ యాప్ ఆవిష్కరణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే.. ఇది కేవలం ఒక కొత్త యాప్ మాత్రమే కాదు, మారుతున్న చట్టపరమైన వాతావరణంలో సంస్థ యొక్క సర్వైవల్ స్ట్రాటజీగా కూడా చెప్పుకోవచ్చు. బంగారం, FDలు, SIPలు వంటి పెట్టుబడులు ఎప్పుడూ భారతీయ వినియోగదారులను ఆకర్షించేవిగా ఉన్నాయి. కనీసం రూ. 10తో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కల్పించడం ద్వారా ఈ యాప్ మరింత విస్తృతమైన వినియోగదారుల వర్గాన్ని చేరుకోవచ్చని డ్రీమ్11 భావిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications