డ్రీమ్ యాక్ట్ 2025 అమెరికా సెనేట్‌లో తిరిగి ప్రవేశపెట్టారు. ఇది అమెరికాలో చిన్నప్పటి నుండి పెరిగిన లక్షలాది డ్రీమర్స్, H-1B వంటి వీసా హోల్డర్ల పిల్లల భవిష్యత్తును మార్పు చేయగల కీలక చట్టంగా భావిస్తున్నారు. ఈ బిల్లును సెనేటర్ డిక్ డర్బిన్, లిసా ముర్కోవ్స్కీ ద్వైపాక్షిక మద్దతుతో సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ చట్టం, పిల్లలుగా యునైటెడ్ స్టేట్స్‌కు వచ్చి, వారి జీవితాల్లో ఎక్కువ భాగం అమెరికాలోనే విద్య, ఉద్యోగం, జీవితం నిర్మించుకున్నప్పటికీ.. ఇమ్మిగ్రేషన్ పత్రాల లోపంతో పౌరసత్వం పొందే అవకాశం లేకుండా ఉన్న యువకులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.
డ్రీమ్ యాక్ట్ 2025 ప్రకారం.. అర్హత గల డ్రీమర్స్‌కు గరిష్ఠంగా ఎనిమిదేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే షరతులతో కూడిన శాశ్వత నివాసి హోదా అందుతుంది. ఈ హోదా వారికి బహిష్కరణ ప్రమాదం లేకుండా అమెరికాలో చట్టబద్ధంగా జీవించడానికి, పని చేయడానికి, అవసరమైతే దేశం వెలుపల ప్రయాణించడానికి హక్కు ఇస్తుంది. నిర్ణీత విద్య, ఉద్యోగం లేదా సైనిక సేవ ప్రమాణాలను పూర్తిచేస్తే, ఈ హోదాను తరువాత పూర్తి స్థాయి లాఫుల్ పర్మనెంట్ రెసిడెన్సీ లేదా సాధారణంగా పిలువబడే గ్రీన్ కార్డ్‌గా మార్చుకోవచ్చు. ఇది అమెరికాలో శాశ్వత స్థిరత్వం పొందడానికి ఒక ముఖ్యమైన మార్గం అవుతుంది.

ఈ బిల్లులో అత్యంత గమనించదగ్గ అంశం డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ కు రక్షణ కల్పించడం. వీరు H-1B, L-1, E-1, E-2 వంటి వీసాలపై అమెరికాకు వచ్చిన నైపుణ్య ఉద్యోగుల పిల్లలు. చిన్నప్పటి నుండి అమెరికాలో పెరిగినప్పటికీ.. 21 సంవత్సరాల వయస్సు పూర్తిచేస్తే, వారి తల్లిదండ్రుల వీసా హోదాకు ఇకపై అర్హత లేకుండా ఏజింగ్-అవుట్ అయిపోతారు. ఈ పరిస్థితి వలన వారు అకస్మాత్తుగా అమెరికా వదిలి వెళ్లవలసి రావడం, లేదా చట్టవ్యతిరేక స్థితిలోకి వెళ్లడం తప్ప మరే మార్గం లేకుండా పోతుంది. 250,000 పైగా డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ ఈ ఉపశమనాన్ని అత్యవసరంగా ఎదురుచూస్తున్నారు.
డ్రీమ్ యాక్ట్ 2025 రక్షణలు, ప్రస్తుతం DACA కార్యక్రమం కింద రక్షణ పొందుతున్న 525,000 మంది యువకులు, అలాగే అమెరికాకు పిల్లలుగా తీసుకువచ్చిన మరో 2 మిలియన్ల అర్హత కలిగిన డ్రీమర్స్ తమ అమెరికాలోనే కొనసాగడానికి అవకాశమిస్తుంది. DACA ప్రోగ్రాం వల్లే డ్రీమర్స్ అమెరికాలో పని చేసి, చదువు పొందుతూ, వారి సమాజానికి సహాయపడగలిగారు. వారు సంవత్సరానికి 6.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ పన్నులు,3.3 బిలియన్ డాలర్ల రాష్ట్ర, స్థానిక పన్నులను చెల్లిస్తున్నారు. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అంచనా ప్రకారం, డ్రీమర్స్ పౌరసత్వానికి మార్గం అందిస్తే వచ్చే దశాబ్దంలో అమెరికా GDP $799 బిలియన్ డాలర్లకు పెరగవచ్చు.
ఇప్పుడు ప్రవేశపెట్టిన అమెరికన్ డ్రీమ్ అండ్ ప్రామిస్ యాక్ట్ 2025.. కాంగ్రెస్ సభ్యులు సిల్వియా గార్సియా, ప్రమీలా జయపాల్ మద్దతుతో ముందుకు వచ్చింది. ఇది TPS (టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్), DED కార్యక్రమాల కింద ఉన్నవారికి కూడా పౌరసత్వం పొందే మార్గాన్ని అందించే ప్రయత్నంగా చెప్పవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ చట్టం అమెరికన్ సమాజంలో సంవత్సరాలుగా జీవించి, చదువుకుని, పనిచేసి, తమను అమెరికన్లుగా భావించే కోట్లాది యువకుల కోసం ఒక చారిత్రాత్మక ఆశగా నిలుస్తోంది. ప్రత్యేకంగా భారతీయ మూలాల వేలాది కుటుంబాల కోసం ఈ బిల్లు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ వలన వారి పిల్లలు అనిశ్చితిలో ఉన్నారు. Dream Act 2025 ఆమోదం పొందితే.. ఈ యువతకు భవిష్యత్‌పై స్పష్టత, స్థిరత్వం, చట్టబద్ధమైన పౌరసత్వానికి ఒక స్పష్టమైన దారి దొరుకుతుందని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications