Dream 11: అధిక రాబడి వస్తుందన్న ఆశతో ప్రజలు మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అంతకంటే వేగంగా డబ్బులు సంపాదించే మార్గం మరోటి ఉందని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అది కాస్త ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో పేర్కొన్న విషయం హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కాదనలేని నిజం. పైగా ఆ పోస్ట్ చేసిన వారు సాధారణ వ్యక్తి కారు.
ఎడిల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ CEO రాధిక గుప్తా సోషల్ మీడియాలో ఓ చిత్రాన్ని పంచుకు నారు. అది తనకు ఇతర వాట్సాప్ గ్రూప్ లో వచ్చినట్లు వెల్లడించారు. అయితే అందులో ఉన్న సమాచారం చూసి ఒకింత ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. దేశంలో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్టర్ల కంటే డ్రీం 11 ప్లేయర్స్ సంఖ్య 5 రెట్లు అధికంగా ఉన్నట్లు దాని సారాంశం అని వివరించారు. డ్రీమ్ 11 ఆటగాళ్లు 20 కోట్ల మంది ఉండగా.. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ కేవలం 4 కోట్లు మాత్రమేనిని అందులో ఉందన్నారు.

ఈ పోస్టులను చూసిన నెటిజన్లు తమదైన ఆర్థిక శైలిలో కామెంట్ చేస్తున్నారు. త్వరగా వచ్చిన సొమ్ము అలాగే పోతుందని కొందరు, అనవసరంగా డబ్బు తగలెయ్యొద్దని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. ఆర్థిక స్వేచ్ఛ అనేది క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల వల్ల మాత్రమే వస్తుందని ఇలాంటి అడ్డదారులవల్ల మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేసి డ్రీమ్ 11 యాప్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా డ్రీమ్ 11 వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ IPL ట్రోఫీ స్పాన్సర్ గా భారీ మొత్తానికి బిడ్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. అప్పటివరకు గేమింగ్ రంగంపై అంతగా పట్టించుకోని ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎంత సంపాదిస్తే టైటిల్ స్పాన్సర్ షిప్ పొందడం కోసం వందల కోట్లు ఖర్చు పెట్టగలరు అంటూ లోతుగా పరిశీలించడం మొదలుపెట్టి గట్టి షాక్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications