Dream 11: వరుసగా అమెరికాలో టెక్ ఆధారిత కంపెనీలు ఉద్యోగులను తొలగించటం చూస్తున్నాం. దీని వల్ల భారతీయులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. H1-B వీసాలను కలిగి ఉన్న ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. తక్కువ సమయంలో మరో ఉద్యోగం ఎతుక్కోవటం కష్టతరంగా మారిందని వాపోతున్నారు. అలాంటి వారికి భారత గేమింగ్ యూనికార్న్ రెడ్ కార్పెట్ ఆఫర్ ప్రకటించింది.

ఇండియాకు వచ్చేయండి..
అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు మన దేశానికి తిరిగి రావాలని డ్రీమ్ 11 CEO, సహ వ్యవస్థాపకుడు హర్ష్ జైన్ పిలుపునిచ్చారు. రానున్న దశాబ్ద కాలంలో భారత్ హైటెక్ వృద్ధిని సాధించడంలో సహాయపడటంలో భాగస్వాములు కావాలని అన్నారు.

క్రంచ్‌బేస్ నివేదిక..
క్రంచ్‌బేస్ అంచనా ప్రకారం 2022లో ఇప్పటి వరకు అమెరికన్ కంపెనీల వల్ల దాదాపు 52,000 మందికంటే ఎక్కువ టెక్కీలు ఉద్యోగాలకు దూరమవుతారని పేర్కొంది. ఇందుకు తీవ్రమైన ఆర్థిక మాంద్యమే కారణమని తెలిపింది. ప్రధానంగా ట్విట్టర్, స్ట్రైప్, సేల్స్‌ఫోర్స్, లిఫ్ట్, స్పాటిఫై, పెలోటన్, నెట్‌ఫ్లిక్స్, రాబిన్ హుడ్, ఇన్‌స్టాగ్రామ్, ఉడాసిటీ, బుకింగ్.కామ్, జిల్లో, లూమ్, బియాండ్‌మీట్ వంటి టెక్ కంపెనీల్లో ఈ తొలగింపులు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

ఒత్తిడిలో స్టార్టప్స్..
కరోనా మహమ్మారి కారణంగా విజృంభించిన స్టార్టప్‌లు మళ్లీ కోలుకోవడం ప్రారంభించాయి. అయితే మళ్లీ మాంద్యం ప్రభావంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లేందుకు నిధుల సేకరణ వాటికి కష్టతరంగా మారింది. ఇది టెక్ స్టార్టప్ స్టాక్స్ పై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ ఎడ్‌టెక్ స్టార్టప్‌లు భారీగా తొలగింపులు చేస్తున్నాయి.

డ్రీమ్ 11 వ్యాపారం..
ముంబై కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న డ్రీమ్ స్పోర్ట్ గ్రూప్ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల కంపెనీల్లో ఒకటి. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 1.50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. రియల్ మనీ గేమింగ్ యాప్‌ల అధికారిక జాబితాలోకి వచ్చిన తర్వాత డ్రీమ్ 11 గత అక్టోబర్ 9న Google Play స్టోర్‌లో ప్రారంభించబడింది. నవంబర్ 2 నాటికి కంపెనీ గేమింగ్ చార్ట్‌లలో అగ్రస్థానంలోకి వచ్చింది.

మెయిల్ చేయాలంటూ..
తమకు 10 పోర్ట్‌ఫోలియో కంపెనీలు ఉన్నాయని హర్ష్ జైన్ తన పోస్ట్‌లో తెలిపారు. అందువల్ల ఉద్యోగం కోల్పోయిన టెక్కీలు.. ప్రత్యేకించి మీరు డిజైన్, ఉత్పత్తి & సాంకేతికతలో అనుభవం ఉన్నట్లయితే తమను సంప్రదించాలని సూచించారు. కంపెనీని సంప్రదించేందుకు ప్రతిభావంతులైన భారత టెక్కీలు [email protected] కు తమ వివరాలను మెయిల్ ద్వారా పంపవచ్చని సీఈవో సుచించారు. తమను సంప్రదించటంలో సంకోచించవద్దని ఆయన తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications