తల్లిదండ్రులకు లేదా దగ్గరి బంధువులకు అద్దె చెల్లించడం చాలా కాలంగా జీతం పొందే ఉద్యోగులు ఉపయోగిస్తున్న ఒక చట్టబద్ధమైన పన్ను ప్రణాళిక విధానం. అద్దె నిజమైనదిగా ఉండి, సరైన డాక్యుమెంటేషన్ ఉంటే.. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) కింద మినహాయింపులను చట్టబద్ధంగా క్లెయిమ్ చేయవచ్చు. అయితే తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) విడుదల చేసిన Draft income tax rules 2026 ఈ ఏర్పాట్లపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
ఇకపై తల్లిదండ్రులు, అత్తమామలు లేదా జీవిత భాగస్వామిని ఇంటి యజమానిగా చూపించి HRA క్లెయిమ్ చేయవచ్చా? అనే ప్రశ్న ఇప్పుడు వస్తోంది. స్పష్టంగా చెప్పాలంటే అవును... కానీ ఎక్కువ పారదర్శకతతో చేయాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్ రూల్ 205 ప్రకారం, బంధువులకు అద్దె చెల్లించడాన్ని ఎక్కడా నిషేధించలేదు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఇంటిని అద్దెకు తీసుకోవడం ఇప్పటికీ చట్టబద్ధంగానే ఉంటుంది. అయితే, ఈ ఏర్పాట్లు నిజమైనవేనా కాదా అన్నదాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం.. బహిర్గత పరిచే (Disclosure) నిబంధనలను కఠినతరం చేసింది.

కొత్త నియమాల ప్రకారం.. HRA క్లెయిమ్ చేసే ఉద్యోగులు ఇకపై ఫారమ్ 12BA (లేదా ప్రతిపాదిత ఫారమ్ 124)లో ఇంటి యజమానితో తనకు ఉన్న సంబంధంను తప్పనిసరిగా వెల్లడించాలి. అంటే, ఇంటి యజమాని తల్లిదండ్రులా, జీవిత భాగస్వామియా, అత్తమామలా అన్న విషయం స్పష్టంగా చెప్పాలి. ఇది నిషేధం కాదు, కానీ పన్ను శాఖకు పరిశీలన చేసే అవకాశం పెంచే చర్య.
ఉదాహరణకు, పూణేలో పనిచేస్తున్న 35 ఏళ్ల అనన్య శర్మ తన తల్లి పేరుపై ఉన్న ఫ్లాట్‌లో నివసిస్తూ నెలకు రూ. 30 వేలు అద్దె చెల్లిస్తోంది. ఆమె సెక్షన్ 10(13A), రూల్ 2A ప్రకారం HRA మినహాయింపును క్లెయిమ్ చేస్తోంది. ఈ లావాదేవీకి అధికారిక అద్దె ఒప్పందం ఉంది, అద్దె మొత్తం బ్యాంక్ ద్వారా చెల్లిస్తోంది. అలాగే ఆమె తల్లి తన ఆదాయపు పన్ను రిటర్న్‌లో అద్దె ఆదాయాన్ని ప్రకటిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో.. డ్రాఫ్ట్ రూల్ 205 వచ్చినా కూడా ఆమె క్లెయిమ్ చెల్లుబాటులోనే ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ కొత్త నిబంధనల ఉద్దేశం నిజమైన అద్దె ఏర్పాట్లను రద్దు చేయడం కాదు. కృత్రిమ లేదా కాగితాల మీద మాత్రమే ఉన్న అద్దె లావాదేవీలను అడ్డుకోవడం. అద్దె నిజంగా చెల్లించబడిందా, మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉందా, రెండు పక్షాలు సరిగ్గా నివేదిస్తున్నాయా అన్నదే ఇప్పుడు కీలకం.
అయితే, అద్దె కల్పితంగా చూపించి వాస్తవంగా చెల్లించకుండా HRA క్లెయిమ్ చేస్తే పరిస్థితి కఠినంగా మారుతుంది. అటువంటి సందర్భాల్లో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 270A ప్రకారం జరిమానాలు విధించవచ్చు. తక్కువగా ఆదాయం చూపిస్తే 50 శాతం జరిమానా.. తప్పుగా నివేదిస్తే 200 శాతం వరకు జరిమానా పడే అవకాశం ఉంది.
క్లుప్తంగా చెప్పాలంటే. డ్రాఫ్ట్ రూల్ 205 కుటుంబ సభ్యులకు అద్దె చెల్లించడాన్ని నిషేధించదు. కానీ, ఇప్పుడు ప్రతి లావాదేవీ వాస్తవికత, డాక్యుమెంటేషన్, పారదర్శకత పరీక్షను తప్పక తట్టుకోవాలి. నిజమైన క్లెయిమ్‌లు రక్షించబడతాయి, కృత్రిమమైనవి మాత్రం కఠిన చర్యలకు గురవుతాయి. ఇది కుటుంబ ఆధారిత అద్దె వ్యవస్థకు ముగింపు కాదు. అయితే అధిక జవాబుదారీతనం మొదలైన సంకేతం అని పన్ను నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications