Dr. Vandana Lal: రూ.3000 కోట్లతో అత్యంత మహిళ సంపన్నుల్లో ఒకరిగా డా. వందనా లాల్..
డాక్టర్ లాల్ పాత్‌లాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వందనా లాల్ రూ. 3000 కోట్లకు పైగా నికర విలువ కలిగిన భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా ఉన్నారు. డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్‌ను 1949లో బ్రిటిష్ ఆర్మీలో జూనియర్ డాక్టర్‌గా పనిచేసిన దివంగత ఎస్‌కె లాల్ ప్రారంభించారు. డాక్టర్ SK లాల్ పూణేలోని ప్రతిష్టాత్మకమైన ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. డాక్టర్ లాల్ అదనపు శిక్షణ కోసం చికాగోలోని కుక్ కౌంటీ ఆసుపత్రికి వెళ్లారు.
వందనా లాల్ 1983లో డాక్టర్ లాల్ పాత్‌లాబ్స్‌లో చేరారు. కంపెనీ పనితీరులో కొన్ని పెద్ద మార్పులను తీసుకొచ్చిన ఘనత ఆమెకు ఉంది. వందనా లాల్ కంపెనీలో చేరిన తర్వాత హిస్టోపాథాలజీ & సైటోపాథాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వందనా లాల్ న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో ఎండీ పాథాలజీ చేశారు. ఆమె ఉన్నత చదువుల కోసం స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ & హడ్డింగ్ హాస్పిటల్‌కు వెళ్లారు.

వందనా లాల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇమ్యునాలజీలో నైపుణ్యం సాధించారు. వందనా లాల్ క్వాలిటీ అస్యూరెన్స్‌లో శిక్షణ పొందారు. దేశవ్యాప్తంగా డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్‌లో నాణ్యత అమలు ప్రక్రియకు ఇది ఎంతగానో ఉపయోపడిందని ఆమె అన్నారు. 2007లో వందనా లాల్ క్లినికల్ రీసెర్చ్ సర్వీసెస్ హెడ్ అయ్యారు. ఆ తర్వాత ఆమె డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్ పరిశోధన & అభివృద్ధి విభాగానికి అధిపతి అయ్యారు.
వందనా లాల్ 1995లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ల్యాబొరేటరీని విస్తరించేందుకు ఆమె చర్యలు తీసుకున్నారు. మార్చి 31, 2023న దాఖలు చేసిన కార్పొరేట్ షేర్ హోల్డింగ్‌ల ప్రకారం వందనా లాల్ నికర విలువ రూ. 3,143.3 కోట్లకు పైగా ఉంది.


Click it and Unblock the Notifications