రష్యా డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-V శుక్రవారం నుండి భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ఒక్కో డోస్ ధరను జీఎస్టీతో కలుపుకొని రూ.995.40గా నిర్ణయించారు. భారత దేశంలో స్పుత్నిక్-V ఉత్పత్తి, పంపిణీ కోసం రష్యన్ సంస్థతో ఒప్పందం చేసుకుంది డాక్టర్ రెడ్డీస్. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఈఓ ఎంవి రమణ మాట్లాడారు. వ్యాక్సీన్‌ను అత్యుత్తమ నాణ్యతతో అందరికీ అందబాటులోకి తీసుకు వచ్చేందుకు తమ సంస్థ పాటుపడుతోందన్నారు.

వీటి ఆధారంగా ధర
రష్యా నుండి దిగుమతి, (మైనస్) -18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయాల్సి ఉండటం వంటి పలు అంశాల ఆధారంగా ధరను నిర్ణయించింది డాక్టర్ రెడ్డీస్. రూ.995గా నిర్ణయించారు. మొత్తం 250 మిలియన్ డోసులను డాక్టర్ రెడ్డీస్ నుండి తీసుకు వస్తామన్నారు. వీటిలో రష్యా నుండి కేవలం 15 నుండి 20 శాతం డోసులు మాత్రమే దిగుమతి చేసుకుంటామన్నారు. మిగతా వాటిని తమ సంస్థ భాగస్వామ్య కంపెనీలలో ఉత్పత్తి చేస్తామన్నారు.

వారంలో రెండో డోస్
స్పుత్నిక్-V రెండో డోస్‌కు సంబంధించిన వ్యాక్సీన్స్ రష్యా నుండి మరో వారంరోజుల్లో భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయన్నారు. మొదట దేశంలోని ముఖ్య నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో స్పుత్నిక్-V టీకాను వినియోగంలోకి తీసుకు రానున్నారు. స్పుత్నిక్-V వ్యాక్సీన్‌ను రూపొందించిన రష్యన్ సంస్థ నుండే సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ అనే మరో టీకా వస్తోంది.

ఆ తర్వాతే అందుబాటులోకి
స్పుత్నిక్ లైట్ అనే మరో వ్యాక్సీన్‌కు క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను డీసీజీఐ పరిశీలించి వినియోగానికి అనుమతించిన తర్వాత దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. DRDOతో కలిసి డెవలప్ చేసిన 2డియాక్సీ డి గ్లూకోజ్(2GD) ఔషధం వినియోగానికి DGCI అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు


Click it and Unblock the Notifications