ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ ఫార్మసీ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్.. మరోసారి ప్రపంచస్థాయిలో గౌరవప్రదమైన స్థానం సాధించింది. బ్లూమ్ బర్గ్ జెండర్-ఈక్వాలిటీ ఇండెక్స్(GEI) 2023లో డాక్టర్ రెడ్డీస్ చోటు సంపాదించింది. ఫార్మాస్యూటికల్ విభాగంలో ఈ ఘనత పొందిన ఏకైక భారతీయ కంపెనీగా నిలిచింది. వరుసగా ఆరవ ఏడాదీ ఈ జాబితాలో చోటు సాధించి రికార్డు సృష్టించింది. 2023 సూచికలో మొత్తం 45 దేశాల్లోని 11 రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 484 కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 16 ట్రిలియన్ డాలర్లు ఉన్న కంపెనీలనే అర్హులుగా పరిగణించారు.

ఇవీ ప్రమాణాలు:
ఆయా కంపెనీల గణాంకాలు, అంతర్గత నిబంధనలు, ఉద్యోగి పాలసీలు, సంస్థకు ప్రజల నుంచి ఉన్న మద్ధతు వంటి 70 కొలమానాల ఆధారంగా లింగ సమానత్వాన్ని GEI అంచనావేసింది. అయితే వీటిలో ప్రతి ఒక్కటీ నాయకత్వ పటిమ, సమాన వేతనం, విభిన్న సంస్కృతుల మేళవింపు, లైంగిక వేధింపుల నివారణ, బ్రాండ్ విలువ వంటి ఐదు విభాగాలకు సంబంధించినదై ఉంటుంది.

కంపెనీ ఎజెండా:
పర్యావరణ, సామాజిక, పాలనా(ESG) ఎజెండాలో భాగంగా.. పలు సాహసోపేతమైన సామాజిక లక్ష్యాలను డాక్టర్ రెడ్డీస్ 2022లో లక్ష్యంగా నిర్ణయించుకుంది:
2030 నాటికి కనీసం 35 శాతం మంది మహిళలను టాప్ మేనేజ్ మెంట్ లో భాగం చేయాలి.
2035 నాటికి సంస్థ అంతటా లింగ సమానత్వం సాధిచాలి.
2030 నాటికి మొత్తం శ్రామికశక్తిలో 3 శాతం వికలాంగులు ఉండాలి.

స్కోర్ పెరుగుదలకు సహాయపడినవి ఇవే..
వీటికి అదనంగా ఏడాది పొడవునా.. కంపెనీ నాయకత్వంలో, ముఖ్య వ్యాపార విభాగాల్లో మహిళల నిష్పత్తిని పెంచడానికి ప్రయత్నించాలని సంస్థ నిర్దేశించుకుంది. మహిళల నియామకానికి మద్ధతు ఇచ్చే వాతావరణాన్ని సృష్టించడానికి అనేక చర్యలను చేపట్టింది. సేల్స్, ఆపరేషన్స్ వంటి సాంప్రదాయేతర రంగాల్లోనూ మహిళలను నియమించుకుంటోంది. ఈ తరహా చర్యల వల్ల ఈ ఏడాది తన స్కోర్ ను మెరుగుపరచుకోగలిగింది.

S&P సస్టైనబిలిటీ ఇయర్‌బుక్:
S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్(CSA) ఆధారంగా.. 2022కి గాను వరుసగా మూడవ సంవత్సరం సస్టైనబిలిటీ ఇయర్‌బుక్ 2023లో డాక్టర్ రెడ్డీస్ చోటు సాధించింది. ఇందులో భాగంగా 61 పరిశ్రమలు, 7800 కంపెనీలు, లక్షా 40 వేల పత్రాలు, 14 మిలియనల్ డేటా పాయింట్లను పరిగణలోనికి తీసుకుంటారు. ఈ బుక్ లో చోటు సాధించాలంటే ఆయా కంపెనీలు తమ పరిశ్రమలోని టాప్ 15 శాతం స్కోర్ సాధించాలి.

డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్:
CSA ప్రమాణాలకు అదనంగా మరింటిని జతచేసి చూసే డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్ (DJSI)లోని ఎమర్జింగ్ మార్కెట్స్ విభాగంలోనూ వరుసగా 7వ ఏడాది ప్రపంచ సుస్థిరత లీడర్ గా డా.రెడ్డీస్ పేరుగాంచింది. దీర్ఘకాలిక ఆర్థిక, పర్యావరణ, సామాజిక ప్రమాణాల ఆధారంగా 20 అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోని 800 అతిపెద్ద కంపెనీల్లో టాప్ 10 శాతం మాత్రమే ఈ DJSI ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ పరిగణలోకి తీసుకుంటుంది.

ESG గోల్స్ సాధనే లక్ష్యం:
"S&P గ్లోబల్, DJSI, బ్లూమ్‌బెర్గ్ GEI వంటి ప్రతిష్టాత్మక ప్రపంచ సంస్థల నుంచి నిరంతరం గుర్తింపు పొందడం మాకు సంతోషంగా ఉంది. స్థిరమైన, న్యాయమైన సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అందుకు అనుగుణంగా వివిధ లక్షాలను నిర్దేశించుకుంటూ రెండు దశాబ్దాల క్రితం మా ప్రయాణాన్ని ప్రారంభించాము. మా ESG లక్ష్యాల్లో పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. నిర్దేశించుకున్న ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకోవడం, వాటి ఫలాలను సమాజానికి అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాము." అని డాక్టర్ రెడ్డీస్ కో-ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.ప్రసాద్ తెలిపారు.

పర్యావరణ హితమే పరమావధిగా..
ఎన్విరాన్‌మెంటల్ సోషల్ గవర్నెన్స్(ESG) విధానాలను అంగీకరించిన డాక్టర్ రెడ్డీస్.. 2004లో తన మొదటి సుస్థిరత నివేదికను విడుదల చేసింది. 2013లో తన కార్యకలాపాల్లో సస్టైనబిలిటీ బై డిజైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. సంవత్సరాలుగా వ్యర్థాలను తగ్గించడం, నీటి నిర్వహణ, కర్బన ఉద్గారాలు, పారదర్శక పాలన, ప్రజల అభివృద్ధి వంటి పలు ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టడం వంటి పలు ESG విధానాలను అనుసరిస్తోంది.

మంచి ఫలితాలు:
కంపెనీ చేసిన ప్రయత్నాలు జీరో లిక్విడ్ డిశ్చార్జ్, జీరో వేస్ట్ ల్యాండ్ ఫిల్, స్వీయ నిర్వహణ బృందాలు వంటి సత్ఫలితాలనిచ్చాయి. 2020లో తన కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు సైన్స్ ఆధారిత లక్ష్యాల చొరవ(SBTi)లో చేరిన మొదటి భారతీయ ఫార్మా కంపెనీగా, ఆసియాలో మూడవదిగా డాక్టర్ రెడ్డీస్ ముద్ర వేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications