గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ మంచి ఫలితాలు సాధించింది. 2019-20 నాలుగో క్వార్టర్‌లో రూ.4,432 కోట్ల ఆదాయాన్ని, రూ.764 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్వార్టర్ ఈపీఎస్ రూ.46గా ఉంది. 2018-19లో ఇదే కాలంలో ఆదాయం రూ.4,016 కోట్లు, నికర లాభం రూ.434 కోట్లుగా ఉంది. ఈపీఎస్ 26.16 ఉంది. దీంతో పోలిస్తే ఈ నాలుగో క్వార్టర్‌లో ఆదాయం 10 శాతం, నికర లాభం 76 శాతం పెరిగింది.

బాగా కలిసి వచ్చిన సంవత్సరం
2019-20 పూర్తి కాలానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ రూ.17,460 కోట్ల ఆదాయాన్ని, రూ.1,949 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్ రూ.117గా ఉంది. 2018-19లో వార్షిక ఆదాయం రూ.15,385 కోట్లు, నికర లాభం రూ.1,879 కోట్లుగా ఉంది. ఈపీఎస్ 113. వార్షిక ఆదాయంలో వృద్ధి 13 శాతం, నికర లాభంలో 4 శాతంగా ఉన్నాయి. పనితీరు, ఆదాయాల పరంగా గత ఏడాది తమకు కలిసి వచ్చిందని కంపెనీ తెలిపింది.

అమెరికా అండగా...
అతిపెద్ద జనరిక్స్ మార్కెట్‌గా ఉన్న ఉత్తర అమెరికా నుంచి రూ.1,807 కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ తెలిపింది. యూరప్ నుంచి రూ.345 కోట్ల అమ్మకాలు ఉండగా, దేశీయ వాటా రూ.683.90 కోట్లుగా నమోదయింది. ఇతర వర్ధమాన మార్కెట్ల నుంచి రూ.804 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జనరిక్ ఔషధాలు విక్రయించడంతో సంస్థకు రూ.3,696.8 కోట్లు సమకూరాయి. ఉత్తర అమెరికా అమ్మకాల్లో 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. కొత్త ఔషదాల విడుదల కలిసి వచ్చినట్లు తెలిపింది.

డివిడెండ్
గత ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌కు రూ.25 లేదా 500 శాతం చొప్పున డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. కాగా, కంపెనీ షేరు ధర నిన్న 3.11 శాతం లాభపడి రూ.3,814 వద్ద క్లోజ్ అయింది.

చైనాపై ఆధారపడటం తగ్గించనున్న కంపెనీ
డాక్టర్ రెడ్డీస్ గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులపరంగా రూ.485 కోట్లకు పరిమితమైంది. 2020-21లో రూ.1,000 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తోంది. అవసరమైన యూనిట్లో పెట్టుబడులు పెట్టి వాటిపై మరింత దృష్టి సారించనుంది. అన్ని వ్యాపార విభాగాల్లో మార్కెట్ కంటే అధిక వృద్ధిరేటును సాధించాలని భావిస్తోంది. కోవిడ్ 19 చికిత్సకు ఉపయోగపడే ఔషధాల తయారీపై కంపెనీ దృష్టి పెట్టనుంది. ఏపీఐలు కోసం చైనాపై ఆధారపడడాన్ని కూడా తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. 2021 జనవరి 30 నుంచి మరో అయిదేళ్ల పాటు జీవీ ప్రసాద్ కంపెనీ సహ చైర్మన్, ఎండీగా కొనసాగనున్నారు. ఈ మేరకు కంపెనీ బోర్డుకు చెందిన నామినేషన్ల కమిటీ నిర్ణయం తీసుకుంది.
More From GoodReturns

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications