Dr.Reddy's: ఫార్మా రంగంలో భారత్ కు ఉన్న పేరు, ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఇండియా మందుల పట్ల సదభిప్రాయం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను తయారు చేస్తూనే.. ఇతర దేశాలకు చెందిన వివిధ సంస్థలతో ఒప్పందం ద్వారానో, పూర్తిగా వాటిని చేజిక్కుంచుకోవడమో చేస్తూ ఫార్మా రంగం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇంతటి ఘనతకు కారణం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడని దిగ్గజ ఔషధ కంపెనీలే అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా డాక్టర్ రెడ్డీస్ సైతం అదే పని చేసింది.

మేయిన్ ఫార్మాలో పోర్ట్ ఫోలియో కొనుగోలు:
ఆస్ట్రేలియాకు చెందిన మేయిన్ ఫార్మా గ్రూప్ లిమిటెడ్లోని US జనరిక్ ప్రిస్క్రిప్షన్ ప్రోడక్ట్ పోర్ట్ ఫోలియోను.. డాక్టర్ రెడ్డీస్ కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. స్విట్జర్లాండ్ బేస్ గా ఉన్న తన అనుబంధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ SA ద్వారా ఈ వ్యవహారాన్ని పూర్తి చేయనున్నట్లు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది. IQVIA అనే అమెరికా సంస్థ ప్రకారం.. డిసెంబర్ 2022 నాటికి మొత్తం పోర్ట్ ఫోలియో మార్కెట్ విలువ దాదాపు రూ.30 వేల కోట్లని అంచనా. దీని ద్వారా తాము పొందుతున్న ఆదాయం రూ.920 కోట్లు అని మేయిన్ ఫార్మా నివేదించింది. దాదాపు రూ.750 కోట్లు ముందస్తుగా చెల్లించనున్నట్లు పేర్కొంది.

గర్భనిరోధక, గుండె సంబంధ ఉత్పత్తులు:
కంపెనీ హస్తగతం చేసుకోనున్న పోర్ట్ ఫోలియోలో 45 వాణిజ్య, 40 ఆమోదించబడిన నాన్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ సహా మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి. గర్భ నిరోధక మాత్రలు, గుండె సంబంధిత వైద్యానికి వినియోగించేవి వాటిలో ముఖ్యమైనవి. తమ దీర్ఘకాలిక, వ్యూహాత్మక లక్ష్యాలను అందుకోవడంలో తాజా కొనుగోలు మరింత సాయపడుతుందని CEO ఎరెజ్ ఇజ్రాయేలీ తెలిపారు. అతి తక్కువ పోటీదారులున్న ఉత్పత్తులు సైతం ఈ జాబితాలో ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీకి సంబంధించిన US రిటైల్ ప్రిస్క్రిప్షన్ ఫార్మాస్యూటికల్ వ్యాపారం వృద్ధికి ఈ డీల్ మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.

ఈ డీల్ గొప్ప ముందడుగు:
తమ రీజియన్ లో మహిళల ఆరోగ్య ఉత్పత్తులు విభాగంలో ఈ డీల్ గొప్ప ముందడుగు అని డాక్టర్ రెడ్డీస్ ఉత్తర అమెరికా విభాగం CEO మార్క్ కికుచి తెలిపారు. ప్రస్తుతం ఉన్న తమ పోర్ట్ ఫోలియోను మరింత మెరుగు పరచుకోవడానికి, వ్యాపారాన్ని వృద్ధి బాటలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

డబ్బు కావలిసినంత ఉన్నా పర్సనల్ లోన్ల వైపు పరిగెత్తుతున్న ధనవంతులు.. కారణం ఏంటంటే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications