Quick Delivery: దేశంలో ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు విస్తృతంగా అందరికీ అందుబాటులోకి రావటంతో కోట్ల మంది ప్రజల జీవితం, జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో వచ్చిన అనేక ఆవిష్కరణలు ప్రజలకు అనేక సేవలను కాళ్లకాడికే చేర్చాయి. అయితే ఇందులో ఒక మంచి ఉన్నప్పటికీ.. అనేక అనర్థాలు కూడా ఉన్నాయని ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకోవటం ప్రారంభిస్తున్నారు.
భారతదేశంలో ప్రస్తుతం అత్యంత వేగవంతంగా ఆహారపదార్థాలను డెలివరీ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ప్రజల ఆరోగ్యంపై ఉండే ప్రభావం గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో జెప్టో కేఫ్, స్విగ్గీ బోల్ట్, జొమాటో బిస్ట్రో పేరుతో కేవలం 10 నిమిషాల్లో ఆహారం డెలివరీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అల్ట్రా ప్రాసెస్ట్ ఫుడ్ వల్ల పోషకాహారంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. స్పీడ్-ఫస్ట్ విధానం ప్రజారోగ్యంపై చెబు ప్రభావాన్ని చూపుతుందని ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ న్యూట్రిబైట్ వెల్నెస్ సహ వ్యవస్థాపకుడు మనన్ వోరా ఆందోళన వ్యక్తం చేశారు. 10 నిమిషాల్లో ఆహారాన్ని డెలివరీ చేయాలంటే దానిని కేవలం 3 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ఉడికించాల్సి ఉంటుందని డాక్టర్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.

అల్ట్రా-ప్రాసెస్డ్, రెడీ-టు-ఈట్ మీల్స్ వంటి వాటి వల్ల మాత్రమే ఇంత వేగంగా ఆహారాన్ని అందించటం సాధ్యమౌతుందని వోరా పేర్కొన్నారు. ఇలాంటి ఆహారాలు తినటం కారణంగా క్యాన్సర్ ప్రమాదం 12 శాతం, హార్ట్ సంబంధిత రోగాలు 10 శాతం, స్థూలకాయం ప్రమాదం 27.8 శాతం భారతదేశంలో పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి అల్ట్రా ప్రాసెస్ట్ ఫుడ్స్ తినటం ప్రజల్లో షుగర్ స్పైక్ వల్ల మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్ పేర్కొన్నారు. ఈ ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె జబ్బులకు దారితీస్తాయని డాక్టర్ పేర్కొన్నారు.
ఇలాంటి ప్రమాదాలు ఉన్నందున క్విక్ ఫుడ్ డెలివరీలకు వెళ్లే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని డాక్టర్ సూచించారు. ఇంట్లో వండిన ఆహారం లేనప్పుడు తప్పని పరిస్థితుల్లో మాత్రమే వీటి జోలికి వెళ్లాలని సూచించారు. ప్రజలు తాజాగా తయారుచేసిన ఆహారం కోసమే ప్రథమ ప్రధాన్యం ఇవ్వాలని డాక్టర్ వోరా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు డాక్టర్ పోస్టుపై తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు. 10 నిమిషాల డెలివరీ దాని ప్రభావాన్ని 10 ఏళ్లలో మరింత దీర్ఘకాలిక అనారోగ్యాలతో కలిగి ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ శంతను దేశ్‌పాండే కూడా ఫాస్ట్ ఫుడ్‌పై స్పందిస్తూ ఇది దేశంలో అతిపెద్ద అంటువ్యాధిగా అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications