బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ అనేది ఓ పెద్ద సమస్య. ఇక్కడ ట్రాఫిక్ లో చిక్కుకున్న ప్రజలకు బైక్ టాక్సీ ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు. ఎందుకంటే క్యాబ్ లేదా ఆటో రిక్షా కంటే బైక్ టాక్సీ చాలా చౌకై. కానీ మీ బైక్ టాక్సీ డ్రైవర్ ఒక పెద్ద కంపెనీ ఉద్యోగి అయితే ఎలా ఉంటుంది... సాధారణంగా యూట్యూబ్ ఇంకా సోషల్ మీడియాలో క్యాబ్ బుక్ చేస్తే లగ్జరీ లేదా కాస్ట్లీ బైక్స్ రావడం చూస్తుంటారు... ఇవన్నీ ప్రాంక్స్ అయినప్పటికీ ఇప్పుడు నిజంగా ఇలాంటి సిన్ బెంగళూరు చోటు చేసుకుంది. అయితే ఇక్కడ లగ్జరీ లేదా కాస్ట్లీ బైక్ లేనప్పటికీ రైడర్ ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగి కావడం గమనార్హం...

తాజాగా ఒక మహిళా ప్రయాణీకురాలు సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది, అందులో తాను బైక్ టాక్సీ పై ప్రయాణిస్తున్నాను కానీ డ్రైవర్ కాల్‌లో మాట్లాడటం చూసి అకస్మాత్తుగా షాక్ అయ్యినట్లు తెలిపింది.
బైక్ రైడర్ ఇన్ఫోసిస్ ఉద్యోగి: నిజానికి, కాల్‌లో బైక్ టాక్సీ రైడర్ ఇంగ్లీషులో 'నా వాయిస్ నీకు వినపడుతుందా?' (Am I audible?) అని అడుగుతాడు. అయితే డ్రైవర్ ఎవరితోనో చాలా కార్పొరేట్ పద్ధతిలో మాట్లాడుతున్నాడు. దింతో ఆ మహిళ అడిగినప్పుడు, ఆ రైడర్ ఇన్ఫోసిస్ కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ టీంలో పనిచేస్తున్నాట్లు చెప్పాడని ఆమె తెలిపింది.
ఈ సంఘటన గురించి చార్మిఖ నాగళ్ల లింక్డ్ఇన్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. ఈ బైక్ రైడర్ ఖాళీ సమయంలో పనికిరాని రీల్స్ చూడకుండా వీకెండ్లో ఇంకా ఉదయం సమయంలో బైక్ టాక్సీ నడుపుతూ డబ్బు సంపాదింస్తున్నడని ఆమె పేర్కొంది. చార్మిఖ నాగళ్ల చేసిన ఈ పోస్ట్‌లో "బెంగళూరు ట్రాఫిక్‌లో త్వరగా చేరుకోవడానికి నేను బైక్ టాక్సీని ఉపయోగిస్తుంటాను. కానీ ఈసారి టాక్సీ రైడర్ కొంచెం ఆశ్చర్యంగా ఉన్నట్లు అనిపించింది. నేను అడిగినప్పుడు అతను ఇన్ఫోసిస్‌లో జాబ్ చేస్తున్నానని చెప్పాడు అని వివరించింది.
నాగళ్ల చేసిన ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో యూజర్లు రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొంతమందికి దీనిని స్ఫూర్తిదాయకం అని అనగా, మరికొందరు ఒంటరితనం సమస్యతో ఆందోళన అని వ్యక్తం చేశారు. ఒక యూజర్ అయితే 'ఇది ఆసక్తికరమైన విషయం' ప్రజలు వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చూస్తుంటే ఇన్స్పైరింగ్'లాగ ఉంది. కానీ ఒంటరితనం గురించి మీరు చెప్పిన విషయం నన్ను ఆలోచింపజేస్తుంది అని అన్నారు. ఆమె ఆ వ్యక్తిని తన జాబ్ గురించి అడిగినప్పుడు, ఉబెర్ రైడర్ తాను B2B ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పనిచేస్తున్నానని, ఆఫీసు నుండి తిరిగి వెళ్తూ, ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక రైడ్ ఫినిష్ చేసుకొని వెళ్తానని సమాధానం ఇచ్చాడు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications