పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్. జూలై 5న బంగారం ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. అమెరికా ఉద్యోగ డేటా వెలువడిన తర్వాత అలాగే వాణిజ్య సుంకాల అంశంలో US-చైనా మధ్య యుద్ధ విరమణ గడువు దగ్గర పడుతున్న వేళ, గ్లోబల్ మార్కెట్లలో పసిడి ధరపై తీవ్ర ప్రభావం చూపింది.ప్రస్తుతం 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6,000 తగ్గి రూ. 9,87,200కి చేరింది. 10 గ్రాముల ధర రూ. 600 తగ్గి రూ.98,720కి చేరింది. ఇదే తరహాలో 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా తగ్గాయి. MCX బంగారం ధరలు రూ. 96,735 కనిష్ట స్థాయిని తాకి రూ. 96,988 వద్ద నిలిచాయి. వెండి మార్కెట్లో మాత్రం స్వల్ప లాభాలు నమోదయ్యాయి.
బంగరం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలు ఏంటంటే.. అమెరికా ఉద్యోగ మార్కెట్ లో స్థిరత్వం కొరవడటంగా చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తుండటంతో పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి ఇతర అంశాల వైపు పెట్టుబడులకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు అమెరికా-వియత్నాం మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కూడా బంగారం ధర తగ్గుదలకు కారణమైంది.

రిద్దిసిద్ధి బులియన్స్ ఎండీ పృథ్వీరాజ్ కొఠారి ప్రకారం.. ప్రైవేట్ రంగంలో జీతాల తగ్గుదల మార్కెట్‌ను దెబ్బతీస్తోంది. మరింత ఉదార ద్రవ్య విధానం కోసం వాదనలు పెరుగుతున్నాయి. ఇక ట్రేడింగ్ పరంగా బంగారం 3,300 డాలర్లు (రూ.96,000) నుంచి 3,400 డాలర్ల (రూ.98,500) స్థాయిలో ట్రేడ్ అవుతుందని అంచనా. మోతీలాల్ ఓస్వాల్ సూచనల ప్రకారం, ప్రస్తుతం బంగారం ధరలు 30% పెరిగిన నేపథ్యంలో.. ఇకపై మరింత స్పష్టమైన మార్కెట్ కోసం పెట్టుబడిదారులు వేచి ఉండటం ఉత్తమం.
దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తమ లాభాలను కాపాడుకోవాలంటే రూ.96,000 కంటే తక్కువ స్థిర ముగింపులో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని చెబుతున్నారు. అయితే దీర్ఘకాలిక అవగాహనతో కూడిన పెట్టుబడి కొనసాగితే, వచ్చే కాలంలో మళ్ళీ లాభదాయకమైన అవకాశాలు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు స్పష్టమైన మార్కెట్ సంకేతాలను పెట్టుబడిదారులు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ర్యాలీకి కారణమైన ప్రధాన అంశాలు ఇప్పటికే మార్కెట్ ధరలలో కనిపిస్తున్నాయని బ్రోకరేజ్ భావిస్తోంది. ఇజ్రాయెల్-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ వంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారంపై ఉండే రిస్క్ ప్రీమియం తగ్గిపోయింది.అమెరికా-చైనా వాణిజ్య వివాదాలు శాంతించడంతో ప్రపంచ వాణిజ్యానికి భద్రత పెరిగింది, దీని ప్రభావం బంగారం ధరల మీద కనిపించింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపును ఆలస్యం చేస్తుండటంతో బంగారం ధరలకు మరింత స్థిరత లభిస్తోంది. ధరలు పెరిగినా ప్రపంచంలోని అనేక కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నాయి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications