donkey milk panner cost: మీరు ఆవు లేదా గేదె పాలతో తయారు చేసిన పనీర్ గురించి విని ఉంటారు, తిని ఉంటారు. అయితే మార్కెట్లో కిలో పన్నీర్ ధర రూ.300 నుండి 400 వరకు అమ్ముతుంటారు. సాధారణంగా పన్నీర్ ప్రతి ఒక్కరి ఇంట్లో వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఇప్పుడు మీ తెలుసుకోబోయే పనీర్ ధర వింటే అవాక్కవ్వాల్సిందే ఎందుకంటే ఈ పనీర్ గాడిద పాలతో తయారు చేస్తారు. దీని ధర కిలోకు దాదాపు లక్ష రూపాయలు ఉంటుంది. అవును, మీరు సరిగ్గానే చదివారు. దీని ధర అక్షరాల ఒక లక్ష. ఇంత రేటు ఎందుకు, ఇందులో ఏంటి ప్రత్యేకత, అసలు ఒక కిలో జున్ను కోసం ఎవరైనా అంత డబ్బు ఖర్చు చేస్తారావు అని ఆలోచించొచ్చు..

గాడిద పాలలో ప్రత్యేకత ఏమిటి: గాడిద పాలు అంటే donkey milk. దీనిని ప్రపంచవ్యాప్తంగా 'ద్రవ బంగారం' అని కూడా పిలుస్తారు. కారణం ఏంటంటే ఈ పాలలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాట్ ఆమ్లాలు, ముఖ్యంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచే లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, గాడిద పాలలో యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయని చెబుతారు. అంటే మీరు వ్యాధులతో పోరాడే శక్తిని పొందుతారు. రోమన్ రాణి క్లియోపాత్రా కూడా చర్మం మెరుపు కోసం ఈ పాలతో స్నానం చేసేదట.
కానీ గాడిద పాలు ఎందుకు అంత ఖరీదు:ఒక గాడిద రోజుకు 200 నుండి 300 మిల్లి లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది. దీని అర్థం ఒక కిలో పాలు సేకరించడానికి చాల గాడిదలు అవసరం, అందుకే దాని ధర అంతగా ఉంటుంది. పాలని జున్నుగా మార్చడం అంత తేలికైన పని కాదు. అందుకే జున్ను తయారు చేసినప్పుడు దానిని బంగారం ధరకు అమ్ముతారు.
ఈ జున్ను ఎక్కడ తయారు చేస్తారు: ఇప్పుడు భారతదేశంలో కొన్ని స్టార్టప్‌లు గాడిద పాలపై పనిచేస్తున్నాయి. గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దీనిని సాగు చేస్తున్నారు. ఒక స్టార్టప్ గాడిద పాలతో చాక్లెట్ ఇంకా సబ్బును కూడా తయారు చేసింది. ఇప్పుడు ఈ లిస్టులో పనీర్ కూడా చేరింది.
ఆరోగ్యం ఉంటేనే సంపద : ఇప్పుడు ప్రజలు అంత ఖరీదైన జున్ను కొంటున్నారా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సమాధానం అవును అనే వినిపిస్తుంది. దీనికి విదేశీ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా యూరప్‌లోని ప్రజలు ఆరోగ్య విషయంలో గాడిద పన్నీరు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని అంగీకరిస్తున్నారు. 2012లో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ ఈ జున్ను వాడినట్లు నివేదికలు వచ్చాయి. ఆ తర్వాత ఈ జున్ను ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, నోవాక్ జొకోవిచ్ ఈ వార్తలను ఖండించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications