అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ఇతర దేశాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా భారతదేశానికి సుంకాలపై వార్నింగ్ ఇచ్చారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపకపోతే, భారతీయ ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఆగస్టు 1 గడువు ముందు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. అయితే ఈ సుంకం ఇంకా ఖరారు కాలేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై చర్చలు మరోసారి హాట్ టాఫిక్ గా మారాయి.
డొనాల్డ్ ట్రంప్ గతంలో పలు దేశాలపై లేఖల ద్వారా హెచ్చరికలు జారీ చేశాయి. అయితే భారతదేశంపై తాజాగా డైరక్ట్ గానే బాంబు పేల్చారు. ఇదిలా ఉంటే గతంలో ఏప్రిల్ 2న భారతీయ దిగుమతులపై 26 శాతం సుంకాన్ని విధించారు ట్రంప్.తాజాగా 25 శాతం సుంకం విధించే అవకాశం ఉందని ఆయన చెప్పడంపై భారత్ పునరాలోచనలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇండియాతో వాణిజ్య ఒప్పందం గురించి చర్చించాలని, లేకపోతే కఠిన సుంకాలు తప్పవని ఆయన ప్రపంచ దేశాలను ఇది వరకు కోరారు. ఇదే సమయంలో భారత్ మా స్నేహితుడు.. కానీ వాణిజ్యంలో సరైన వైఖరి అవసరమని ట్రంప్ స్పష్టం చేయడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.

డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో అమెరికా వాణిజ్య సంబంధాలను "చాలా కష్టమైనవి"గా అభివర్ణించారు. గత దశాబ్దంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగినప్పటికీ.. యుకె వస్తువులపై వాణిజ్య లోటు రెట్టింపు అయిందని ఆరోపణలు గుప్పించారు. ప్రత్యేకంగా భారత్ విధిస్తున్న అధిక సుంకాలపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశానికి ముందు.. భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. భారత ప్రధాని మోదీతో చర్చల సందర్భంగా కూడా.. మీరు మాతో సమానంగా వ్యవహరించడం లేదన్నారు.
అమెరికా వాణిజ్య శాఖ డేటా ప్రకారం.. గత సంవత్సరం అమెరికా.. భారత్ నుంచి 87 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. భారతదేశం మాత్రం అమెరికా నుంచి కేవలం 42 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంది. ఈ గణాంకాలు రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య అసమతుల్యత ను స్పష్టంగా సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ ఇటీవల కొన్ని నెలలుగా భారత్‌తో trade deal దాదాపుగా పూర్తి అయిందని చెబుతున్నారు.
మే నెలలో, అమెరికా ఎగుమతులపై భారత్ సున్నా సుంకం విధించేందుకు అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. అయితే భారత్ ఈ వ్యాఖ్యలను ఖండించింది. అలాందేమి జరగలేదని తెలిపింది. ఆగస్టు 1 గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో, రెండు దేశాలూ చర్చలను వేగవంతం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం జరగకపోతే, ట్రంప్ ప్రకటించిన 25 సుంకాలు అమల్లోకి వస్తాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications