అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ వస్తువులపై ఆయన విధించిన భారీ సుంకాలు (Trump Tariffs) ఇప్పుడు అగ్రరాజ్య సుప్రీంకోర్టు గడప తొక్కాయి. నేడు (జనవరి 14, 2026) ఈ సుంకాల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

న్యాయస్థానం అడ్డుకుంటే 'ప్లాన్-బి'!
ట్రంప్ టారిఫ్ లకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనికి సంబంధించిన తీర్పు ఈ రోజున వెలువడే అవకాశం ఉంది. అయితే కోర్టు తీర్పు కంటే ముందే ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను విధించిన సుంకాలను సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టేస్తే, తాను ఊరుకోబోనని ట్రంప్ స్పష్టం చేశారు. "కోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే.. మేము ప్రత్యామ్నాయ మార్గాలను (Alternative Ways) అన్వేషిస్తాం" అని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా చైనా ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులే ఈ టారిఫ్ లను సవాల్ చేస్తూ కేసులు వేశారని ఆయన ఆరోపనలు చేస్తున్నారు.
టారిఫ్ ల వల్ల లాభమెంత?
విమర్శకులు ఈ సుంకాల వల్ల అమెరికాలో ధరలు పెరుగుతున్నాయని అంటున్నా.. ట్రంప్ మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు.
- ద్రవ్యలోటు తగ్గింపు: తాను విధించిన టారిఫ్ ల వల్ల కేవలం కొన్ని నెలల్లోనే అమెరికా ఫెడరల్ బడ్జెట్ ద్రవ్యలోటు 27 శాతం మేర తగ్గిందని ట్రంప్ గణాంకాలతో వివరించారు.
- విదేశాల నుండే వసూలు: ఈ పన్నులను అమెరికా ప్రజలు కట్టడం లేదని, ఎగుమతి చేసే విదేశీ కంపెనీలే చెల్లిస్తున్నాయని ఆయన వాదిస్తున్నారు. దీనివల్ల అమెరికా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తిరిగి చెల్లించడం 'అసాధ్యం'!
సుప్రీంకోర్టులో విచారణకు ముందు ట్రంప్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ లు కలకలం రేపుతున్నాయి. ఒకవేళ కోర్టు ఈ టారిఫ్ లను రద్దు చేస్తే, ఇప్పటివరకు వసూలు చేసిన వేల కోట్ల డాలర్లను తిరిగి కంపెనీలకు చెల్లించడం ప్రభుత్వానికి అసాధ్యమని ఆయన హెచ్చరించారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను గందరగోళంలోకి నెట్టేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్ పై ప్రభావం ఏంటి?
ట్రంప్ విధించిన టారిఫ్ ల వల్ల భారత్ వంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులపై అదనపు భారం పడింది. ముఖ్యంగా ఇరాన్ తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం అదనపు సుంకం విధించడం భారత కంపెనీలకు టెన్షన్ పుట్టిస్తోంది. నేడు వచ్చే సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్‌కు వ్యతిరేకంగా వస్తే.. భారత ఎగుమతిదారులకు అది పెద్ద ఊరటనిస్తుంది.
మొత్తంగా చూస్తే ట్రంప్ ఈ టారిఫ్ లను వదిలిపెట్టేలా లేరు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) ఉపయోగించి ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడికి అంత అధికారం ఉందా లేదా అనేది నేడు తేలిపోనుంది. ఒకవేళ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ప్రపంచ వాణిజ్యంలో ట్రంప్ 'టారిఫ్ బాంబులు' మరిన్ని పేలే అవకాశం ఉంది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications