Donald Trump: అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన బాధ్యతలు నేడు చేపట్టనున్నారు. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికాను నడిపే వ్యక్తి ఒక బడా వ్యాపారవేత్త కావటం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన తన తెలివితేటలను మరోసారి ఉపయోగించి కేవలం కొన్ని గంటల్లోని బిలియన్లను సంపాదించారు.
ఆశ్చర్యకరంగా డొనాల్డ్ ట్రంప్ తన పేరుమీద ట్రంప్ మీమీ కాయిన్ ప్రారంభించి క్రిప్టో కరెన్సీని ప్రారంభించాడు. అయితే ఇది మార్కెట్లో ఒక్కసారిగా తుఫానుగా మారింది. ట్రంప్ క్రిప్టోకాయిన్‌ను కొనుగోలు చేయడానికి లింక్‌ను ట్రంప్ యొక్క సోషల్ మీడియా కంపెనీ ట్రూత్ సోషల్‌లో షేర్ చేయటంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రారంభంలో కేవలం 18 సెంట్రుగా ఉన్న దీని ధర ప్రస్తుతం దాదాపు 71 డాలర్లకు చేరుకుంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎంపిక కావటంతో చాలా మంది ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు.

అమెరికాలో 18వ తేదీ ఉదయం 10 గంటలకు లాంచ్ అయిన ట్రంప్ కాయిన్ ప్రస్తుతం 985.46 శాతం పెరిగి 70.48 డాలర్ల రేటుకు చేరుకుంది. దీంతో ట్రంప్ కాయిన్ మార్కెట్ విలువ ఏకంగా 14.17 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత విలువ ఏకంగా పదుల బిలియన్ డాలర్ల మేర పెరుగుదలను నమోదుచేసింది. డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సంస్థ మొత్తం 1 బిలియన్ ట్రంప్ టోకెన్‌లను జారీ చేయాలని నిర్ణయించిందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ తన మద్ధతుదారులకు ట్విట్టర్ ఖాతా పోస్ట్ ద్వారా తన పేరుతో విడుదల చేసిన క్రిప్టో కాయిన్ లో పెట్టుబడి పెట్టాలని పిలుపునిచ్చారు. ట్రంప్ మీమీ కాయిన్ కొనుగోలు కోసం gettrumpmemes.com వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు. అయితే దీన్ని పెట్టుబడిగా లేదా పెట్టుబడి ఒప్పందం లేదా రుణానికి సెక్యూరిటీగా తీసుకోకూడదని దీని ద్వారా ప్రకటించబడింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 200 మిలియన్ నాణేలలో 80 శాతం CIC డిజిటల్ LLC, ఫైట్ ఫైట్ ఫైట్ LLC అనే రెండు కంపెనీలచే నియంత్రించబడతాయని తెలుస్తోంది.
#WATCH | US: At the Private Reception in Washington, Reliance Industries Chairman Mukesh Ambani & Founder & Chairperson of Reliance Foundation, Nita Ambani congratulated President-elect Donald Trump ahead of his swearing-in ceremony
— ANI (@ANI) January 19, 2025
The swearing-in ceremony of President-elect… pic.twitter.com/rWIpw19ou4
ట్రంప్‌తో అంబానీ బేటీ..
వ్యాపారంలో అందరికంటే ఒక అడుగు ముందుండాలని భావించే బిలియనీర్ అంబానీ దంపతులు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడానికి ఒక రోజు ముందే కలిశారు. రెండవసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న వేళ వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో చాలా మంది అతిధులు ఇండియా నుంచి అమెరికాకు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖేష్-నీతా అంబానీలు ట్రంప్ ప్రమాణ కార్యక్రమానికి ముందు రోజు పార్టీలో కలిసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications