Trump Gold Card Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. ధనవంతులైన వలసదారుల కోసం కొత్తగా 'గోల్డ్ కార్డ్' పెట్టుబడిదారుల వీసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా గ్రీన్ కార్డ్ లేదా శాశ్వత నివాసం కోసం EB-5 వీసా కోసం ద్వారా ఎదురుచూస్తున్న చాలా మంది భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుత EB-5 వీసా కార్యక్రమాన్ని భర్తీ చేసే ఈ కొత్త గోల్డ్ కార్డ్ పథకం కింద ఒక్కో దరఖాస్తుదారుకు దాదాపు 5 మిలియన్ డాలర్లు ఖర్చు చేయల్సి ఉంటుందని వెల్లడైంది.
తాము గోల్డ్ కార్డ్‌ను అమ్మబోతున్నామని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో అన్నారు. కొత్త పథకం కింద 'గ్రీన్ కార్డ్ ప్రత్యేక హక్కులు ప్లస్' అని.. ఇది కార్డు పొందిన వ్యక్తులకు అమెరికా పౌరసత్వానికి మార్గాన్ని అందిస్తుందని ట్రంప్ వివరించారు. ఈ పథకం 2 వారాల్లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ వ్యక్తులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి, ఎక్కువ పన్నులు చెల్లిస్తారని.. అలాగే చాలా మందికి ఉద్యోగాలను సైతం కల్పిస్తారని ట్రంప్ కొత్తగా తెస్తున్న గోల్డ్ కార్డ్ కార్యక్రమం గురించి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది తప్పకుండా విజయవంతం అవుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.

అధ్యక్షుడితో పాటు విలేకరులతో మాట్లాడిన వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, గోల్డ్ కార్డ్ కార్యక్రమం ప్రస్తుత EB-5 వీసా కార్యక్రమాన్ని పూర్తిగా భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు. ట్రంప్ కొత్త 'గోల్డ్ కార్డ్' ప్రతిపాదనపై సిలికాన్ వ్యాలీకి చెందిన డెమోక్రట్, వలస సంస్కరణల న్యాయవాది అజయ్ భూటోరియా ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ తాజా నిర్ణయం కారణంగా గ్రీన్ కార్డ్ వెయిట్‌లిస్ట్‌లో చిక్కుకున్న లక్షలాది మంది ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులకు న్యాయం, అవకాశాలను అందించే వలస సంస్కరణల కోసం నేను సంవత్సరాలుగా పోరాడుతున్నానని పేర్కొన్నారు. సంపన్న విదేశీయులకు గోల్డెన్ కార్డ్ ద్వారా పౌరసత్వాన్ని అందించేందుకు కొత్త మార్గాన్ని తీసుకురావటంపై ఆయన తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేశారు.
కొత్త వీసా స్కీమ్ అమెరికా శ్రామికశక్తికి, సమాజానికి వెన్నెముకగా నిలిచిన వ్యక్తులను ఇది పక్కన పెడుతుందని అజయ్ భూటోరియా అభివర్ణించారు. 5 మిలియన్ డాలర్లు చెల్లించి గ్రీన్ కార్డ్, పౌరసత్వాన్ని కొనుక్కోవచ్చు అనే ఆలోచన, ఇంజనీర్లు, వైద్యులు, టెక్ రంగానికి చెందిన భారతీయులకు శాపంగా పేర్కొన్నారు. చాలా మంది ఇప్పటికే 50 ఏళ్లకు పైగా సాగే వెయిట్‌లిస్ట్‌లో గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వీరు తమ విలువను నిరూపించుకుని, పన్నులు చెల్లిస్తూ, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ అమెరికా గడ్డపై జీవిస్తున్నారని ఆయన అన్నారు. ట్రంప్ చర్యలు డబ్బు ముసుగులో దురహంకారంగా పేర్కొన్నారు.
ఎక్కువ డబ్బును ఇచ్చేవారికి అమెరికా పౌరసత్వాన్ని వేలం వేయటాన్ని లాయర్ తప్పుపట్టారు. EB-5 యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా నిర్వహించబడే ఒక పెట్టుబడిదారుల వలస కార్యక్రమం. ఇది అర్హత కలిగిన పెట్టుబడిదారులు USలో కొత్త వాణిజ్య సంస్థలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మరియు అమెరికన్‌లకు కనీసం 10 కొత్త, పూర్తి-కాల ఉద్యోగాలను సృష్టించడం ద్వారా US గ్రీన్ కార్డ్‌లను పొందడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. EB-5 కార్యక్రమం కింద అర్హత సాధించడానికి కనీస పెట్టుబడి అవసరం $1,050,000 లేదా పెట్టుబడి అర్హత కలిగిన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లో లేదా టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియాలో చేసినట్లయితే 8 లక్షల డాలర్లుగా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications