155 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరిక..చేతనైంది చేసుకోమంటూ చైనా వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై తన వాణిజ్య ఒత్తిడిని మరింత పెంచుతున్నారనే సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ తాజా ప్రకటనలో అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోతే, నవంబర్ 1 నుండి చైనా వస్తువులపై 55 శాతం నుంచి 155 శాతం వరకు సుంకాలను పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ప్రకటన వైట్ హౌస్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో జరిగిన సమావేశంలో చేశారు.
ప్రస్తుతం చైనా ఇప్పటికే 55 శాతం సుంకాలు చెల్లిస్తోంది. చాలా దేశాలు అమెరికాను ఉపయోగించాయి, కానీ ఇకపై అలా చేయలేవు. ఒప్పందం కుదరకపోతే, నవంబర్ 1 నుండి సుంకాలు 155 శాతానికి పెరుగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ ఇప్పటికీ చైనాతో న్యాయమైన, సమన్వయమైన' వాణిజ్య ఒప్పందం కోసం ఆశతో ఉన్నారని చెప్పారు. నవంబర్ చివరలో APEC శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తో సమావేశమవ్వనున్నారు.

ఈ సమావేశం తర్వాత అమెరికా నుండి సోయాబీన్ కొనుగోలు సహా, రెండు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వచ్చే సంవత్సరం చైనాకు పర్సనల్ స్ఫర్శన కోసం వెళ్లేందుకు ట్రంప్ ఆహ్వానం పొందినట్లు చెప్పారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి, చైనా వస్తువులపై 55 శాతం సుంకాలు ఇప్పటికే అమలు అయ్యాయి. ఇటీవల అదనపు 100 శాతం సుంకాలు, కీ సాఫ్ట్‌వేర్ ఎగుమతులపై నిషేధం కూడా ప్రకటించారు, ఇవి నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి.
ఈ చర్యల ప్రధాన కారణం ఏంటంటే.. చైనాకు చెందిన అరుదైన భూమి పదార్థాల ఎగుమతుల నియంత్రణ, అమెరికాకు వచ్చే సరఫరా గొలుసులపై ప్రమాదం తగ్గించడం. ఈ కొత్త నియమాలను "ఇంతవరకు అంతర్జాతీయ వాణిజ్యంలో తీసుకున్న అతిపెద్ద చర్యగా ట్రంప్ అభివర్ణించారు.
అయితే చైనా ఈ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుంకాల ద్వారా బెదిరించడం సరైన మార్గం కాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. ప్రతిస్పందనగా చైనా కూడా ఎలక్ట్రానిక్స్ మరియు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులలో ఉపయోగించే అరుదైన భూమి పదార్థాల ఎగుమతిని కఠినతరం చేసింది. ఈ నిర్ణయం ప్రపంచ సరఫరా గొలుసులపై ఒత్తిడిని పెంచింది.చైనా తన ప్రధాన వాణిజ్య సంధానకర్తను మార్చి లీ యోంగ్జీ ని నియమించింది. ఇది అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ విమర్శలకు ప్రతిస్పందనగా వచ్చింది.
ట్రంప్ తెలిపిన వివరాల ప్రకారం.. సుంకాలు అతని అత్యంత బలమైన వాణిజ్య ఆయుధం. చైనా మమ్మల్ని అరుదైన ఖనిజాలతో బెదిరించిందని, అందుకే ఈ చర్య తీసుకున్నట్లు Trump చెబుతున్నారు.అయినప్పటికీ జిన్‌పింగ్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని కోరుతున్నామని, నవంబర్ 1కి ముందు ఒప్పందం సాధ్యమని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు.


Click it and Unblock the Notifications