H-1B visa: వీసాలపై డొనాల్డ్ ట్రంప్-ఎలాన్ మస్క్‌ది ఒక్కటే మాట.. H-1B వీసాలపై భారీ చర్చ..
H-1B visa Debate: మరో రెండు రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జనవరి మూడవ వారంలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ప్రస్తుతం నివశిస్తున్న ఇమ్మిగ్రెంట్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ట్రంప్ వీసాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఆందోళనలు చాలా మందిలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
తాజాగా డొనాల్డ్ ట్రంప్ అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం ఉద్దేశించిన ఇమ్మిగ్రేషన్ వీసాలకు తన మద్దతు ఉంటుందని వ్యక్తం చేశారు. దీనిపై జరిగిన చర్చల్లో ఎలాన్ మస్క్ కూడా జతకట్టారు. వీసాలను నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఉద్ధేశించినవేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. H-1B వీసా ప్రోగ్రామ్‌ను ప్రస్తావిస్తూ, ప్రత్యేక పాత్రల కోసం విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలను అనుమతిస్తుందని ట్రంప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో అమెరికాలో H-1B వీసాల చుట్టూ చర్చ వేడెక్కుతున్న వేళ ట్రంప్ కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఈ కేటగిరీ వీసాల విషయంలో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ప్రస్తుతం ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించడంలో స్వర ప్రతిపాదకులు, నైపుణ్యం కలిగిన ఇమ్మిగ్రేషన్‌ను విస్తరించాలని వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీసాలపై ట్రంప్ వైఖరి ఆయన సపోర్టర్లకు మింగుడుపడటం లేదు. చాలా మంది ట్రంప్ అభిమానులు అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వటంలో ప్రధాన్యతను కొనసాగించాలని, ఇమ్మిగ్రేషన్ రూల్స్ కఠినతరం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై యుద్ధానికి సిద్ధమని ట్రంప్ వ్యాఖ్యానించిన ఒక్కరోజు తర్వాత ట్రంప్ కామెంట్స్ వచ్చాయి.
ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఇద్దరూ అమెరికాలోని సాంకేతిక పరిశ్రమ భారతదేశం వంటి దేశాల నుంచి ఇంజనీర్లు, నిపుణులపై ఎక్కువగా ఆధారపడుతుందని వాదించారు. మీ జట్టు ఛాంపియన్‌షిప్ గెలవాలని మీరు కోరుకుంటే, వారు ఎక్కడ ఉన్నా టాప్ టాలెంట్‌లను మీరు రిక్రూట్ చేసుకోవాల్సిందేనని మస్క్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. యూఎస్ సిలికాన్ వ్యాలీలో అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ కలిగిన నిపుణులకు కొరత ఉండటాన్ని మస్క్ సూచించారు. ట్రంప్ పరిపాలనలో ఏఐ విధానానికి నాయకత్వం వహించడానికి భారతీయ సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను నియమించిన తర్వాత చర్చ మరింత ఊపందుకుంది. నైపుణ్యం కలిగిన కార్మికులకు గ్రీన్ కార్డ్ పరిమితులను సడలించడం కోసం కృష్ణన్ చేసిన వాదన వివాదానికి దారితీసింది. విమర్శకులు కృష్ణన్ "ఇండియా ఫస్ట్" ఎజెండాను ముందుకు తెచ్చారని ఆరోపించారు.


Click it and Unblock the Notifications