హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ సమీపంలోని హై-ప్రొఫైల్ రోడ్డుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించడం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ.. ఈ ప్రతిపాదనను అసంబద్ధమైన, రాజకీయ ప్రదర్శనాత్మక చర్యగా అభివర్ణించింది. ప్రతిపాదన ఆమోదిస్తే ఆ రహదారి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ గా గుర్తింపు పొందనుంది.
ప్రముఖ గ్లోబల్ సంస్థలు, విశిష్ట వ్యక్తులకు గౌరవ సూచకంగా రోడ్ల పేర్లను మార్చే పథకంలో భాగంగా ఈ ప్రతిపాదన చేయబడిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా PTI ప్రచురించిన సమాచారం ప్రకారం.. ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR)ను ఔటర్ రింగ్ రోడ్ (ORR)తో అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు భారత పారిశ్రామిక దిగ్గజం దివంగత రతన్ టాటా గౌరవార్థం పేరు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవలి యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (USISPF) సమావేశంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కీలక రోడ్లకు గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో వంటి గ్లోబల్ టెక్ కంపెనీల పేర్లు పెట్టాలన్న ప్రతిపాదనను ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తోంది. ఆ క్యాంపస్ సమీపంలోని రహదారికి గూగుల్ స్ట్రీట్ అనే పేరు పెట్టే ఆలోచన ఉంది.
అదే విధంగా మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిర్ణయం తెలంగాణను ఇన్నోవేషన్ ఆధారిత గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా నిలపడానికి, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచడానికి, ప్రపంచ సంస్థల సహకారాన్ని గుర్తించడానికి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఈ ప్రతిపాదనపై తీవ్రంగా స్పందించారు. ఆయన రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పేర్లు మార్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఆసక్తి చూపుతోందంటే, ముందు చరిత్రలో పాతుకుపోయిన పేర్లను గౌరవించాలి. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా, ఎవరు సోషల్ మీడియాలో ట్రెండ్ అయినా వారి పేర్లతో రోడ్లు మార్చడంలో ఈ ప్రభుత్వం బిజీగా ఉంది. అలాగే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని బీజేపీ డిమాండ్ చేసిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల అవసరాలకంటే ప్రచారం మీద పని చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు.
ప్రజా ప్రతినిధుల ప్రకటన ప్రకారం.. ఈ పేరు మార్పులు ప్రభుత్వం చేపట్టిన విస్తృతమైన అభివృద్ధి దృక్పథంలో భాగం. రాష్ట్ర అభివృద్ధి రంగాల్లో ప్రపంచ భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రపంచ సంస్థలతో సంబంధాలను బలపరచడం, హైదరాబాదును భవిష్యత్ టెక్నాలజీ రాజధానిగా నిలబెట్టడం ముఖ్య లక్ష్యంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది.
42 దేశాల నుండి 2,500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవంలో నోబెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, Trump మీడియా & టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ప్రసంగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనుంది, దీని ద్వారా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలను ఇందులో ప్రస్తావించనున్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications