అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "ట్రంప్ గోల్డ్ కార్డ్" (Trump Gold Card) అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. అమెరికాలో ఉండే భారతీయ గ్రాడ్యుయేట్లను (Indian Graduates) అమెరికన్ కంపెనీలు తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి వీలుగా ఈ కార్డుని తీసుకొచ్చారు. ఈ కార్డు ఉంటే అమెరికాలో దీర్ఘకాలం పాటు నివాసం ఉండొచ్చు. అలాగే అమెరికా పౌరసత్వం పొందడానికి కూడా హెల్ప్ అవుతుంది. అయితే ఈ కార్డు పొందాలంటే ఏం చేయాలి? దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రంప్ ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ "హాస్యాస్పదంగా" ఉందట. ప్రతిభావంతులైన విద్యార్థులు అత్యుత్తమంగా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వస్తోందట. అందుకే ఈ ఈ సమస్యకు పరిష్కారంగా ట్రంప్ గోల్డ్ కార్డ్ (Trump Gold Card) తీసుకొచ్చారు. అమెరికా దేశాభివృద్ధికి ఈ కార్డు దోహదపడుతుందని ఆయన అన్నారు.
గోల్డ్ కార్డ్‌కు భారీ ఖరీదు
ఈ 'ట్రంప్ గోల్డ్ కార్డ్' పథకం ప్రధానంగా డబ్బు చెల్లించే వారికి వేగవంతమైన వసతి మార్గాన్ని అందిస్తుంది. ఈ పథకం వివరాల్లోకి వెళ్తే..
- వ్యక్తిగత దరఖాస్తుదారులు: గోల్డ్ కార్డ్‌ను పొందడానికి ఒక వ్యక్తి ఒక 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.9.1 కోట్లు) విరాళం చెల్లించాల్సి ఉంటుంది.
- కార్పొరేట్ సంస్థలు: కంపెనీలు తమ ఉద్యోగులను అట్టిపెట్టుకోవడానికి ఒక్కో ఉద్యోగికి 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18 కోట్లు) చెల్లించి కార్డ్‌ను కొనుగోలు చేయవచ్చు.
- వెట్టింగ్ ప్రాసెస్: దీనికి అదనంగా వెట్టింగ్ ప్రాసెస్ కోసం.. 15,000 డాలర్లు (సుమారు రూ.12.5 లక్షలు) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఈ వెట్టింగ్ పూర్తయిన తర్వాత ఆమోదం పొందిన ఉద్యోగికి ఐదేళ్ల తర్వాత పౌరసత్వానికి మార్గం లభిస్తుంది.
అమెరికన్ కంపెనీలకు భరోసా
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వంటి టెక్ దిగ్గజాలు సంవత్సరాలుగా ఈ సమస్యను ప్రస్తావించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. హార్వర్డ్, ఎంఐటీ వంటి అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్ అయినా కూడా.. వారిని నియమించుకోవడానికి కంపెనీలు వెనుకాడతాయి. ఎందుకంటే వారిని దేశంలో అట్టిపెట్టుకోగలమని హామీ ఉండదు. అయితే Trump Gold Card ద్వారా కంపెనీలు తమకు కావలసిన టాలెంట్‌ను నిశ్చింతగా ఉంచుకోవచ్చు. ఇది టెక్ రంగానికి చాలా ఉపయోగపడుతుందని అలాగే అమెరికన్ ట్రెజరీకి అనేక బిలియన్ల డాలర్ల ఆదాయం వస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
భారతీయ నిపుణులపై ప్రభావం
యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న విదేశీ విద్యార్థులలో భారతీయులు ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి ఈ కొత్త Trump Gold Card కార్యక్రమం భారతీయ టెక్ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లపై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా డ్రీమ్‌ను సాకారం చేసుకోవాలనుకునేవారికి ట్రంప్ పరిపాలన ఇప్పుడు ఒక ఖరీదైన ధరను నిర్ణయించింది. డబ్బు చెల్లించి కార్డు తీసుకుని అక్కడ ఎంచక్కా ఉద్యోగాలు చేసుకోవచ్చు.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్.. 4 వేల మైళ్ల దూరం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరంపై దాడి..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications