అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను రేపుతున్నారు. టారిఫ్ విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపిన ట్రంప్ తగ్గేదేలే అంటూ ముందుకు పోతున్నారు. ఆయన తీసుకొచ్చిన సుంకాల పెంపుపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా ఐ డోన్ట్ కేర్ అంటున్నారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన అత్యవసర సుంకాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే.
అయితే ఈ తీర్పు వెలువడిన కొన్ని గంటలకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సార్వత్రిక సుంకాన్ని విధిస్తూ శుక్రవారం ఒక ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వుపై Trump సంతకం చేశారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వెల్లడించారు. అన్ని దేశాలపై గ్లోబల్ 10 శాతం సుంకంపై ఓవల్ ఆఫీస్ నుంచి సంతకం చేయడం నాకు గౌరవంగా ఉంది. ఇది దాదాపు వెంటనే అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రణాళికకు సంబంధించిన పూర్తి వివరాలను కార్యనిర్వాహక ఉత్తర్వులో, వైట్ హౌస్ శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో పొందుపరిచింది.
అధ్యక్షుడు ఈ విధానాన్ని 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 ఆధారంగా అమలు చేస్తున్నారు. ఈ నిబంధన ప్రకారం భారీగా లేక తీవ్రమైన వాణిజ్య లోటులను తగ్గించేందుకు 150 రోజుల పాటు 15 శాతం వరకు సుంకాలను విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. వైట్ హౌస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ తాత్కాలిక దిగుమతి సుంకాలు ఫిబ్రవరి 24న అర్ధరాత్రి 12:01 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.
అయితే ఈ సార్వత్రిక సుంకం నుంచి కొన్ని కీలక వస్తువులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు కూడా వైట్ హౌస్ తెలిపింది. ముఖ్యమైన ఖనిజాలు, లోహాలు, గొడ్డు మాంసం, టమోటాలు వంటి వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే ఔషధాలు, ఎలక్ట్రానిక్స్ వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులు ఈ సుంకం పరిధి నుంచి బయట ఉంటాయి. అదేవిధంగా 2020లో ట్రంప్ తొలి పదవీకాలంలో కుదిరిన త్రైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా కెనడా, మెక్సికోలను కూడా ఈ కొత్త సుంకాల నుంచి మినహాయించనున్నట్లు వైట్ హౌస్ స్పష్టం చేసింది.
ఈ కొత్త ఉత్తర్వు వాణిజ్య చట్టంలోని సెక్షన్ 232 కింద ఇప్పటికే అమలులో ఉన్న ఉక్కు, అల్యూమినియం సుంకాలను అలాగే సెక్షన్ 301 కింద చైనా వస్తువులపై విధించిన సుంకాలను యథాతథంగా కొనసాగిస్తుంది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రాకపోవడంతో, కోర్టు నిర్ణయం వాటిపై ప్రభావం చూపలేదు. అదే సమయంలో శుక్రవారం సంతకం చేసిన మరో ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా, సుప్రీంకోర్టు కొట్టివేసిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విధించిన సుంకాలను రద్దు చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ఆ సుంకాలు ఇకపై వసూలు చేయబోవని ఆ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో.. IEEPA చట్టాన్ని ఈ స్థాయిలో వినియోగించడం ద్వారా ట్రంప్ తన అధికారాలను మించిపోయారని పేర్కొంది. ఇది అధ్యక్షుడి ఆర్థిక ఎజెండాలో కీలకమైన అంశానికి పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు నిర్ణయం తీవ్రంగా నిరాశపరిచింది అంటూ విమర్శించారు. అయితే, కోర్టు తీర్పును దాటవేయడానికి తన వద్ద ఇతర శక్తివంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. వారి నిర్ణయం తప్పు. కానీ అది పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మన దగ్గర మరిన్ని శక్తివంతమైన మార్గాలు ఉన్నాయని వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్‌తో పాటు సంప్రదాయవాద న్యాయమూర్తులు నీల్ గోర్సుచ్ , అమీ కోనీ బారెట్ కూడా కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఏకపక్షంగా సుంకాలు విధించలేడన్న అభిప్రాయానికి మద్దతు ఇవ్వడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సభ్యులు తమ నిర్ణయంపై సిగ్గుపడాలని ఆయన ట్రూత్ సోషల్‌లో రాశారు. అయితే, ఇప్పుడు సర్దుబాటు ప్రక్రియ మొదలైందని.. గతంలో కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.
క్లుప్తంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలు అమెరికా వాణిజ్య విధానాన్ని మరోసారి అనిశ్చితి దిశగా నడిపిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
More From GoodReturns

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications