కొన్నేళ్ల క్రితం వరకు, 40 ఏళ్ల వయసు అంటే ఉద్యోగ జీవితం శిఖరానికి చేరిన దశగా పరిగణించబడేది. పిల్లల చదువులు, ఇంటి లోన్, కొంతమంది అయితే రెండో ఇంటి ఆలోచనలు కూడా మొదలయ్యేవి. కానీ ఇప్పుడు ఆ దృశ్యం తారుమారైంది. కార్పొరేట్ ఇండియాలో మిడ్-కేరియర్ ప్రొఫెషనల్స్‌గా పరిగణించబడే 40-45 ఏళ్ల వయస్సు వర్గం కొత్త ఒత్తిడుల, అనిశ్చితి దశలోకి అడుగుపెడుతోంది. ఆకస్మికంగా వచ్చే జాబ్ లాస్, ముందస్తు రిటైర్మెంట్లు, లేదా సైలెంట్ పుష్ అవుట్‌ల వల్ల ఉద్యోగ భద్రత పోతుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు కానీ ఇప్పుడే మేల్కొని, స్మార్టుగా ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది.

Aionion Group డైరెక్టర్ వినోద్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించినట్టు ఇప్పుడిప్పుడే ఈ వయస్సు గల ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయే లేదా స్వచ్ఛందంగా తప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇది భయపడాల్సిన అవసరం లేకపోయినా, ముందస్తుగా చురుకైన ఆర్థిక ప్రణాళిక చేపట్టడం చాలా అవసరం. ప్రస్తుతానికి కార్పొరేట్ ఇండియాలో 40 ఏళ్ల వయసు ప్రజలు మౌనంగా ఒక ప్రమాదకరమైన జోన్‌లోకి నడుస్తున్నారు.
ఒకప్పుడు మీరు సీనియర్‌గా అనిపించే స్థాయి ఇప్పుడు ఖర్చుగా మారుతోంది. కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది. ఆటోమేషన్ మానవ శ్రమను తగ్గిస్తోంది. కంపెనీ ceo ఇప్పుడు 'లాభాల్ని' మాత్రమే చూస్తున్నారు ఎంత అనుభవం ఉన్నాకూడా తాజా నైపుణ్యాలపైనే దృష్టి పెడుతున్నారు.
ఎందుకు ఈ వయస్సే టార్గెట్ అవుతోంది?
ఇప్పుడు కంపెనీలు సీనియర్ ఉద్యోగులను చూసే దృష్టిలో మార్పులు వచ్చాయి. సీనియరిటీ ఉన్న ఉద్యోగులకు ఎక్కువ జీతం చెల్లించాల్సి రావడం యాజమాన్యాలపై భారంగా ఉంటుంది. అంతేకాదు, చాలా మంది మిడ్-కేరియర్ ప్రొఫెషనల్స్ తమ స్కిల్స్‌ను ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్టు మారకపోవడం వల్ల కొత్త అవసరాలను తీరుస్తున్న తరం వారితో పోల్చితే వారు వెనుకబడిపోతున్నారు. అదే సమయంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుట్‌పుట్ ఇవ్వగలిగే యువ ఉద్యోగులు కంపెనీలకు మరింత లాభదాయకంగా మారారు. మరోవైపు, డిజిటలైజేషన్ వేగంగా చోటు చేసుకోవడంతో మానవ వనరులపై అవసరం తగ్గిపోతుండటమే కాక, ఆటోమేషన్ వల్ల మానవ శ్రమను బదిలీ చేయడం ప్రారంభమైంది.
శ్రీనివాసన్ చెప్పే మూడు కీలక సూచనలు:
1. ఈ రోజుల్లో ఒక్క ఉద్యోగ జీతం మీద ఆధారపడటం అనేది ఒక మైనస్ పాయింట్‌గా మారుతోంది. ఏ ఒక్క నిర్ణయం వల్ల ఆ జీతం ఆగిపోతే, జీవన విధానం మొత్తం కుదేలు కావచ్చు. కాబట్టి ప్రతి నెల వచ్చే జీతంతో ఒక చిన్న మొత్తాల్లో అయినా పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాలి. ఉదాహరణకు SIPలు, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా డిజిటల్ అసెట్స్ వంటివి మీకు పాసివ్ ఆదాయాన్ని అందిస్తాయి. అలాగే, మీకు ప్రత్యేకంగా ఇష్టమైన లేదా మంచి స్కిల్ ఉన్న విషయాల్లో చిన్న స్కేల్‌లో బిజినెస్ మొదలుపెట్టడం కూడా ఒక మంచి ఆప్షన్. ఇది ప్యాషన్‌తో కూడిన సంపాదన మార్గంగా మారుతుంది.
2. ఇప్పటి కార్పొరేట్ ప్రపంచం వేగంగా మారుతోంది. కొత్త టెక్నాలజీలు, డిజిటల్ ప్రాసెసులు, డేటా ఆధారిత నిర్ణయాలు ప్రతి రంగానికీ ప్రవేశిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాత నైపుణ్యాలతోనే కొనసాగడం ప్రమాదకరం. మార్కెట్ అవసరాలకు తగ్గట్టు మీరు మీ పనితీరును, స్కిల్ల్స్‌ను నవీకరించుకోవడం ఎంపిక కాదు అవసరం. డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ లిటరసీ వంటి కోర్సులు కొత్త విండోస్‌ను తెరుస్తాయి. ఈ స్కిల్స్ వల్ల మీరు కొత్త అవకాశాలను అన్వేషించగలరు. ఉద్యోగంగానే కాకుండా, కన్సల్టింగ్, ఫ్రీలాన్సింగ్, ఆన్‌లైన్ కోర్సులు లేదా సొంత ప్రాజెక్టుల రూపంలోనూ.
3. ఇది నిజానికి ఒక కొత్త దశకు ప్రవేశించేందుకు వచ్చిన ఆహ్వానం. జీతం మీద ఆధారపడే జీవనశైలిని వదిలి, మీ ఆదాయాన్ని మీరు నియంత్రించే స్వతంత్ర జీవితం వైపు తీసుకెళ్లే అవకాశం ఇది.
రిటైర్మెంట్ అనేది ఉద్యోగం ముగింపు కాదని గుర్తించండి అది మీరు మీ జీవితాన్ని పూర్తిగా మీ నియంత్రణలోకి తీసుకొచ్చే ప్రారంభ దశ కావచ్చు. వయసు మీద ఆధారపడి కాదు... విజన్ మీద ఆధారపడి జీవితం మలచుకోవాలనే సందేశం ఇది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications