ఈ వారం మీ ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక చిన్న సూచన "ఫారం పూర్తి చేసిన వెంటనే "సబ్మిట్" బటన్ నొక్కేయకండి. ముందుగా డ్రాఫ్ట్‌గా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇదే స్టెప్ మీకు తర్వాత పెద్ద తలనొప్పి తప్పించవచ్చు.
ఎందుకంటే మీరు సబ్మిట్ చేసే వరకు, ఆ ఫారం కేవలం "డ్రాఫ్ట్" మాత్రమే ఉంటుంది. ఈ దశలో మీరు ఎప్పుడైనా లాగిన్ అయ్యి, పొరపాట్లు దిద్దుకుని, కొత్తగా ఫిల్ చేయవచ్చు. కానీ ఒకసారి "సబ్మిట్" చేస్తే ఇక మార్పులకి అవకాశం ఉండదు. పొరపాటు ఉంటే దాన్ని సరిచేయడానికి మీరు తప్పనిసరిగా ఆ పొరపాటు ఉన్న ITRను "ఈ-వెరిఫై" చేసి, తర్వాత "రివైజ్డ్ ITR" ఫైల్ చేయాలి.

చాలా మంది ఫారం ఫిల్ చేసిన వెంటనే ఉత్సాహంగా సబ్మిట్ చేస్తారు. కానీ తర్వాతే "అరే! బ్యాంక్ ఖాతా నెంబర్ తప్పు ఇచ్చాను!", ఇన్వెస్ట్‌మెంట్ వివరాలు మిస్ అయ్యాయి అని గమనిస్తారు. ఈ సమయంలో, మీరు ఫారం డ్రాఫ్ట్‌గా సేవ్ చేసుంటే, లాగిన్ అయి సులభంగా మార్చేస్తారు. కానీ సబ్మిట్ చేసేసి ఉంటే, ఇక రివైజ్డ్ ITR దారి తప్ప వేరే దారి ఉండదు.
కొన్ని సార్లు ఇలాంటివి జరుగుతాయి. మీరు ITR సబ్మిట్ చేసి ఉండొచ్చు కానీ ఈ-వెరిఫై చేయకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు, దాన్ని తప్పనిసరిగా 30 రోజుల్లో ఈ-వెరిఫై చేయాలి. మధ్యలో ఎక్కడైనా పొరపాటు కనిపిస్తే, ముందుగా ఈ-వెరిఫై పూర్తి చేసి తర్వాతే రివైజ్డ్ ITR ఫైల్ చేయాలి. కానీ 30 రోజులు గడిచిపోతే, మీరు సబ్మిట్ చేసిన ITR డిస్కార్డ్ అవుతుంది. అప్పుడు మళ్లీ దాన్ని బెలేటెడ్ ITRగా ఫైల్ చేయాల్సి వస్తుంది మరియు అదనంగా లేట్ ఫీజు కూడా చెల్లించాలి.
మీరు ITRను డ్రాఫ్ట్‌గా సేవ్ చేసి ఈ-వెరిఫై చేయకపోతే, ఇప్పటికీ దాన్ని ఎడిట్ చేసి సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇది తప్పనిసరిగా సెప్టెంబర్ 15, 2025 లోపు పూర్తి చేయాలి. ఈ గడువుకు మించి సబ్మిట్ చేస్తే, దానికి లేట్ ఫీజు విధించబడుతుంది.
మీరు ITRను ఫైల్ చేసి సబ్మిట్ చేసి, 30 రోజుల్లో ఈ-వెరిఫై కూడా చేసి ఉంటే, తర్వాత ఏదైనా పొరపాటు కనిపిస్తే, డిసెంబర్ 31, 2025 లోపు రివైజ్డ్ ITR ఫైల్ చేయవచ్చు. అలాగే, మీరు ITRను డ్రాఫ్ట్‌గా సేవ్ చేసి, 30 రోజులు ఏమీ చేయకపోతే, అంటే సబ్మిట్ చేయకుండా, ఈ-వెరిఫై చేయకుండా వదిలేస్తే, ఆ ITR ఇంకా సబ్మిట్ కాలేదు. ఈ పరిస్థితిలో ఇప్పుడు బెలేటెడ్ ITR ఫైల్ చేసి, లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆశిష్ నిరాజ్ (పార్ట్నర్, ASN & కంపెనీ) చెబుతున్నట్టు ITRను సబ్మిట్ చేసిన వెంటనే ఈ-వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. సబ్మిట్ చేసిన తర్వాత కూడా 30 రోజులు టైమ్ ఉంది. ఆ మధ్యలో ఏదైనా పొరపాటు గమనిస్తే, సబ్మిట్ చేసిన ITRను డిస్కార్డ్ చేసి కొత్త ITR ఫైల్ చేయవచ్చు. కానీ డెడ్‌లైన్ తర్వాత అదే చేయడం అంటే, మీరు ITR ఫైల్ చేయనట్టే అవుతుంది, అప్పుడు తప్పనిసరిగా లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
డెడ్‌లైన్ మిస్ అయితే ఏమవుతుంది?
అభిషేక్ సోని (సంస్థాపకుడు, Tax2win) చెబుతున్నట్లుగా, డెడ్‌లైన్ మిస్ అవ్వడం అనేక సమస్యలు తేవచ్చు. ముందుగా, లేట్ ఫైలింగ్ కోసం పెనాల్టీ విధించబడుతుంది. సాధారణంగా గరిష్టంగా రూ. 5,000 వరకు పెనాల్టీ పడవచ్చు. ఆదాయం రూ. 5 లక్షలకు తక్కువ ఉంటే రూ. 1,000 మాత్రమే, ఎక్కువ అయితే రూ. 5,000 వరకు ఉంటుంది. అదనంగా, లేట్ ఫైలింగ్, అడ్వాన్స్ టాక్స్ తక్కువ చెల్లించడం లేదా ఆలస్యంగా చెల్లించడం వంటి పరిస్థితులలో ఇంటరెస్ట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని లోసెస్, ముఖ్యంగా హౌస్ ప్రాపర్టీ లాస్ మినహా, ఆలస్యంగా ఫైల్ చేస్తే క్యారీ ఫార్వర్డ్ చేయలేరు. డెడ్‌లైన్ తర్వాత ఫైల్ చేస్తే రిఫండ్ ప్రాసెస్ కూడా ఆలస్యం అవుతుంది. అంతేకాక, ఆలస్యంగా ఫైల్ అయిన ITRపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మరింత స్క్రూటినీ లేదా పద్ధతిగా పరిశీలన కూడా చేస్తుంది.
చివరిగా ఫారం పూర్తి చేసిన వెంటనే సబ్మిట్ చేయకండి. ముందుగా డ్రాఫ్ట్ సేవ్ చేసి ఒకసారి బాగా చెక్ చేయండి. పొరపాటు ఉంటే సులభంగా దిద్దుకోవచ్చు, లేకుంటే తర్వాత రివైజ్డ్ ITR తిప్పలు పడాల్సి వస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications